విశ్వంవాయిస్ న్యూస్, అంబేద్కర్ కోనసీమ జిల్లా:
*దిశ యాప్ మెగా డ్రైవ్ లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన*
*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా*
పోలీస్ అధికారులను, సిబ్బందిని, సచివాలయ మహిళా పోలీసులను అభినందించిన ఎస్పీ
విశ్వం వాయిస్ ఎస్పీ కార్యాలయం న్యూస్
దిశ యాప్ అత్యవసర సమయంలో మహిళల రక్షణకు వజ్రాయుధం లాంటిదని జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్, . రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 14 తేదీన జరిగిన దిశ యాప్ మెగా డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాలతో డా.బి.ఆర్.అబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు వార్డు/సచివాలయం మహిళ పోలీసులు వారి పరిధిలోని గ్రామాలు, బస్టాండ్, ముఖ్యమైన కూడళ్ళు, కాలేజీలు, స్కూల్ లు, షాపింగ్ మాల్స్ లలో దిశ యాప్ మెగా డ్రైవ్ నిర్వహించి ప్రజలకు దిశ యాప్ గురించి విస్తృత అవగాహన కల్పించి వారిచే దిశ యాప్ డౌన్లోడ్ చేయించి రిజిస్ట్రేషన్ చేయించారు. అదేవిధంగా జూన్ 15 గురువారం కూడా ప్రజలచేత దిశ యాప్ లు డౌన్లోడ్ చేయించి యున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దిశ యాప్ మెగా డ్రైవ్ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, వార్డు/సచివాలయం మహిళ పోలీసులు ప్రజలకు దిశ యాప్ గురించి విస్తృత అవగాహనా కల్పించి ది.14.06.2023 వ తేదీన 22591 రిజిస్ట్రేషన్లు, ది.15.06.2023 వ తేదీన 23400 రిజిస్ట్రేషన్లు, మొత్తముగా 45,991 మొబైల్ ఫోన్ లలో దిశ యాప్ డౌన్లోడ్ చేయించారు. పోలీస్ సిబ్బంది విశేష కృషి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దిశ యాప్ డౌన్లోడ్ లలో డా బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాష్ట్రములోనే ప్రదమ స్థానంలో నిలిచింది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దిశ యాప్ డౌన్లోడ్ లో విశేష కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది, వార్డు/సచివాలయం మహిళ పోలీసులను అభినందించారు.
దిశ యాప్ మహిళలకే కాదు, అందరికీ ఉపయోగపడుతుందన్నారు. ఆపద ఏసమయంలో ఏరూపంలో వస్తుందో ఎవరు ఊహించలేరని, అటువంటి ఊహించని ఆపదలు ఎదురైనప్పుడు వాటి నుండి బయట పడడానికి పోలీసుల తక్షణ సహాయం కోసం దిశ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని, దిశ యాప్ 🆘 ప్రెస్ చేసిన లేదా మొబైల్ ఫోన్ షేక్ చేసిన, లొకేషన్ కంట్రోల్ రూమ్ ద్వారా దగ్గరలో ఉన్న పోలీస్ అధికారులకు చేరుతుంది, తద్వారా వారు ఆ ప్రదేశానికి పోలీసులు చేరుకుని ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారని తెలిపారు. కనుక దిశ యాప్ అవశ్యకత తెలుసుకొని ప్రతి ఒక్కరూ వారి మొబైల్ ఫోన్ లలో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా ఎస్పీ గారు కొరినారు. మహిళల రక్షణకు దిశ యాప్ వజ్రాయుధం లాంటిదని జిల్లా ఎస్పీ తెలిపారు.