జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు ఆధ్వర్యంలో
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్లరేవు:
తాళ్ళరేవు మండల పరిధిలోని పెద్ద బాపనపల్లి చిన్న బాపనపల్లి గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజబాబు మాట్లాడుతూ రైతులకు కొన్ని సూచనలు చేశారు. ఒక రైతు కౌలుకు చేస్తున్న పొలానికి మరొక రైతు పూర్తిగా వెళ్లి ప్రస్తుతం రైతు ఇచ్చే కౌలుకు రెట్టింపు అధికంగా మీరు చెల్లించేందుకు ముందుకు ఎవరు వెళ్లరాదని సూచించారు. రైతులు అలా చేయడం వల్ల భూ యజమాని బాగుపడటం తప్ప కౌలు రైతు తీవ్ర నష్టం పొందుతున్నారని హెచ్చరించారు . అలాగే కౌలు రైతు కార్డుకు భూ యజమాని అంగీకరించకపోతే భూమికి కౌలుకి తీసుకోకుండా ఉండాలని రైతులకు పిలుపునిచ్చారు. అనంతరం మాట్లాడుకున్న తీర్మానాలకు కౌలు రైతులందరూ అంగీకారం తెలిపారు. ఈ సమావేశంలో తాళ్ళరేవు మండల కౌలు రైతులు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పాల్గొన్నారు.