వరద ప్రభావిత ప్రాంతాలు పర్యటించిన యానం ఆర్డిఓ మునిస్వామి
విశ్వంవాయిస్ న్యూస్, యానం:
కేంద్రపాలిత ప్రాంతం యానంలో గోదావరికి వరద నీరు ఎక్కువ అవుతున్న సమయంలో యానం పరిపాలనాధికారి ప్రజలను అప్రమత్తం చేశారు. రాజీవ్ బీచ్, దరియాల తిప్ప ప్రాంతంలో వరద నీరు రాకుండా అడ్డుగా ఇసుక బస్తాలు వేయించారు. అనంతరం దరియాలతిప్ప బస్టాండ్ వెనుక ఉన్న గోదావరి నది అనుకుని ఉన్న గృహాల వద్దకు వెళ్లి అక్కడకు వరద నీరు చేరడంతో అక్కడ నివసించే ప్రజలకు ధైర్యం చెప్పారు.