విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం పట్టణం:
టిట్కో ఇల్లు కేటాయింపులో మున్సిపల్ అధికారుల చేతివాటం
లక్షల్లో చేతులు మారాయి అంటూ జనసేన కౌన్సిలర్లు
ఆరోపణ
అమలాపురం టౌన్ విశ్వం వాయిస్ న్యూస్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలనీ జిల్లా అమలాపురం పట్టణ మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో జనసేన పార్టీ కౌన్సిలర్లు ఏడిద శ్రీను టిట్కో ఇల్లు కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ప్రశ్నించగా మున్సిపల్ అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలకు కేటాయించిన కేటాయింపు నుంచి 72 ఇల్లు అర్హులు కాదంటూ తొలగించి తిరిగి తొలగించినటువంటి వార్డులలో నిరుపేదలకు ఇవ్వకుండా ఒకే ఆధార్ కార్డు రేషన్ కార్డు తో ఆరు ఇల్లులు కేటాయింపు జరిగిందని దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేసి బోడసకుర్రు లో నిర్మించిన టిట్కో గృహాల అక్రమాలు పై దర్యాప్తు చేసి అర్హులైన వారికి ఇల్లు కేటాయించాలని అవినీతికి పాల్పడిన మున్సిపాలిటీ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారాయనిసోమవారం కలెక్టర్ స్పందన అర్జీ పరిష్కార వేదికలో కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు
ఈ కార్యక్రమంలో జనసేన కౌన్సిలర్ ఏడిద శ్రీను పిండి అమరావతి, గండి దేవి హారిక, శ్రీదేవి పడాల, గొల్ల కోటి విజయలక్ష్మి, సత్యలక్ష్మి ఫిర్యాదు చేశారు