WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేసిన కొండలరావు

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, మామిడి కుదురు:

మెగాస్టార్ , పద్మభూషణ్ అవార్డు గ్రహీత కొణిదెల చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం పాశర్లపూడి లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాశర్లపూడి గ్రామానికి చెందిన జనసేన నాయకులు కొమ్ముల కొండల రావు ఆధ్వర్యంలో ఆయన నివాసంలో చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. చిరంజీవి బర్త్ డే కేకుని కొండలరావు కట్ చేసి అభిమానులకు పంచారు.అనంతరం గ్రామంలోని పేదలకు చీరలు,దుస్తులు పంపిణీ చేసి సేవాగుణాన్ని చాటుకున్నారు.మెగాస్టార్ చిరంజీవి స్పూర్తితో తాను సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు కొండల రావు తెలిపారు.మెగాస్టార్ సేవా కార్యక్రమాలతో ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు అని,ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారని తెలిపారు .ప్రజల దీవెనలు, దేవుని ఆశీస్సులు చిరంజీవికి ఎల్లవేళలా ఉండాలని కొండల రావు ఆకాంక్షించారు .ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల శాఖ అధ్యక్షుడు జాలెం శ్రీనివాస రాజా, సర్పంచ్ సమాఖ్య అధ్యక్షుడు అడబాల తాత కాపు, ఐ వి కుమార్, ఎంపీటీసీ కొమ్ముల జంగమయ్య, వార్డు సభ్యులు ఆచంట ఫణీంద్ర సాయి,కంకిపాటి నరసింహ రావు, తుండూరి బుజ్జి,మందా గాంధీ, కే.నాగేంద్ర , తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement