—– ఎస్సీ ఎస్టీలకి సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని వినతి
— లోకేష్ పాదయాత్రకు బ్రహ్మరథం
— పి.గన్నవరం నియోజకవర్గం టీడీపీ సీనియర్ నాయకులు జాలెం సుబ్బారావు…
విశ్వంవాయిస్ న్యూస్, మామిడికుదురు:
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నేత నారా లోకేష్ బాబును మర్యాదపూర్వకంగా కల్సినట్లు పి. గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాలెం సుబ్బారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా మామిడికుదురు మండలంలోని నగరం గ్రామంలో స్థానిక విలేఖరులతో జాలెం సుబ్బారావు మాట్లాడుతూ…. పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ నియోజకవర్గమైన చింతలపూడిలో నారా లోకేష్ బాబు చేస్తున్న పాదయాత్రలో రెండు రోజులపాటు తాను కూడా పాల్గొన్నానని తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులు కొండేటి ఆనంద్ బాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు జాలా బాలాజీ, నగరం వార్డు నెంబర్ కోళ్ల సురేష్ లతో పాటుగా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని రాష్ట్రంలో నిర్వీర్యమైన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో పాటుగా కార్పొరేషన్ నిధులు, ఎస్సీ సంక్షేమ పథకాల పునరుద్ధరణకు కృషి చేయ్యాల్సిందిగా, విదేశీ విద్యా విధానానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టేందుకు కృషి చేయాల్సిందిగాను నారా లోకేష్ బాబును కోరినట్లు జాలెం తెలిపారు. నారా లోకేష్ బాబు పాదయాత్రలో సుమారు 30 కిలోమీటర్లు నారా లోకేష్ బాబుతో కలసి నడిచినందుకు చాలా ఆనందంగా ఉందని జాలెం తెలిపారు. నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రకు ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తుందని జాలెం తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని, వైఎస్సార్సీపీ ప్రజా వ్యతిరేక పాలన ముగిసిపోతుందని ఈ సందర్భంగా జాలెం సుబ్బారావు తెలియచేసారు.