రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న తాళ్లరేవు మండలం టిడిపి నాయకులు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
తెలుగుదేశం పార్టీ కార్యాలయం ముందు చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసిన కారణంగా ముమ్మిడివరం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో తాళ్ళరేవు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి రిలే నిరాహార దీక్ష లో పాల్గొన్నారు, ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న నాయకులు అందరూ ఈ రిలే దీక్షకు మద్దతు గా వచ్చి దీక్షలో పాల్గొన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఇంచార్జ్ మరియు మాజీ శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు ముందుగా ముమ్మిడివరం పల్లిపాలెం లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో చంద్రబాబునాయుడు ఆరోగ్యం బాగుండాలని, ఈ తప్పుడు కేసులు నుండి త్వరగా బయటకు రావాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు, అనంతరం నిరాహార దీక్షలో పాల్గొని బుచ్చిబాబు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అరెస్టునీ దేశ విదేశాల్లో ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారని నిన్న బెంగళూరులో ఐటీ ఉద్యోగులు నడిరోడ్డు మీదకు వచ్చి చంద్రబాబు నాయుడు ని వెంటనే విడుదల చేయాలని ఈ కేసుల నుండి త్వరగా బయటపడాలని నినాదాలు చేశారు, ఈ కేసు నమోదు చేసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్ సూపర్డెంట్ ని కొత్తగా నియమించడం జరిగిందని రాష్ట్ర మంత్రివర్గంలోని ఒక మంత్రి బంధువును జైలు సూపర్డెంట్ గా నియమించారని వారిద్వారా ఏమైనా బాబు గారికి హాని జరిగిన ఎడల ప్రభుత్వం మరియు జగన్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీక్షా శిబిరంలో ఉన్నవారందరూ చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టును నిరసిస్తూ చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలియజేశారు, స్థిర వారం నాడు ముమ్మిడివరం నియోజవర్గం నుండి ఈరోజు 5వేల పోస్ట్ కార్డులు’ బాబు తో నేను’ అనే నినాదంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోస్ట్ చేయడం జరిగింది, ఇది పూర్తిగా తప్పుడు కేస్ అని త్వరలో ఆయన బయటకు వస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి గుత్తుల సాయి మందాల గంగ సూర్యనారాయణ వాడ్రేవు వీరబాబు పొన్నమండ రామలక్ష్మి ధూళిపూడి బాబి మోపురి వెంకటేశ్వరరావు వాసంశెట్టి శ్రీనివాస్ కట్ట త్రిమూర్తులు జక్కల ప్రసాద్ బాబు టేకుమూడి లక్ష్మణరావు కట్టా త్రిమూర్తులు సాధనాల వెంకట శివరామకృష్ణ ఊడావెంకట రామకృష్ణ ధూళిపూడి సుబ్బారావు భైరవమూర్తి తదితర మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.