WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

జైలు కారాగారాలన్ని పేదల కోసమే నిర్మించారా ! – ప్రజలకు, బాధితులకు నేటి పోలీస్ లతో ఎలాంటి ప్రయోజనం లేదు.

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

మానవ హక్కులు అమలు కాని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా.
– భారతదేశంలో 95% పెదలే జైళ్లలో మగ్గుతున్నారు.
– పోలీస్ శిక్షణ ఒక విధంగాను,డ్యూటీ మరో విధంగాను అమలు జరుగుతుంది.

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

జైలు కారాగారాలన్ని పేదల కోసమే నిర్మించారా !

– ప్రజలకు, బాధితులకు నేటి పోలీస్ లతో ఎలాంటి ప్రయోజనం లేదు.

– మానవ హక్కులు అమలు కాని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా.

– భారతదేశంలో 95% పెదలే జైళ్లలో మగ్గుతున్నారు.

– పోలీస్ శిక్షణ ఒక విధంగాను,డ్యూటీ మరో విధంగాను అమలు జరుగుతుంది.

 

– రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు మేడా శ్రీనివాస్ విశ్లేషణ

రాజమహేంద్రవరం, విశ్వం వాయిస్ న్యూస్:

పోలీస్ శాఖలో అవార్డులు, పతకాలు సమర్థులకే దక్కుతున్నాయా ! అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి)ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టి వారంతపు సమావేశంలో అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు.శ్రీనివాస్ మాట్లాడుతూ జైలు కారాగారాల్లో నేరస్తులు, సంఘ విద్రోహులు నిర్భందానికి గురవుతున్నారా ! లేక అమాయకులు పైన , అన్యాయాలను, అక్రమాలను ప్రశ్నించే వారు మాత్రమే జైలు నిర్భందాలకు బలైతున్నారా అని ఆయన సందేహం వ్యక్తం చేసారు. ఆమాత్యులు, వారి వారసులు పోలీస్ చట్టాలకు చుట్టాలుగా వ్యవహరిస్తున్నారని, సగటు పౌరునికి పోలీస్ స్టేషన్ లో రక్షణ కలుగుతుందనే నమ్మకం పౌరులకు లేకపోయిందని అయన తెలిపారు.నేరాలు చేస్తున్న వారికి ,

ఆ నేరాలను ప్రోత్సహిస్తున్న ధనవంతులకు పోలీస్ వారు అత్యంత మర్యాదలు ఇస్తున్నారని,

ఆ నేరలను ఎత్తిచూపే వారిపై అక్రమ కేసులు భనాయిస్తున్నారని , అక్కరకు రాని రాజకీయ కక్ష పూరిత కేసుల తోనే నేడు పాలనా వ్యవస్థ మొత్తం బ్రష్టు పట్టుకు పోయిందని ఆయన ఆవేదన చెందారు. కనీసం బెయిల్ పెట్టుకునే స్తోమత లేని పేదవారిని మాత్రమే మన పోలీస్ వారు నేరస్తులుగా నిర్భందించి జైళ్లకు పంపుతారని, న్యాయం అత్యంత ఖరీదైనదిగా మారిన కారణంగా నిజం రోజు చచ్చి బ్రతుకుతుందని, అక్రమార్కులు, అవినీతి పరులు శాసన కర్తలుగా వ్యవస్థను సాసిస్తున్నారని ఆయన తీవ్ర మనస్థాపం చెందారు.

 

ప్రజలకు భాదితులకు నేటి పోలీస్ లతో ఏలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని, సామాన్యులపై జరిగే దాడులు,అఘాయిత్యాలపై పోలీస్ వారు తక్షణమే స్పందించ లేకపోతున్నారని, పిర్యాదు సైతం తీసుకోలేక పోతున్నారని, పిర్యాదు అంశములు కూడా బాదితునికి జరిగిన సమస్య వ్రాయకూడదని, అక్కడ వున్న సంబంధిత పోలీస్ చెప్పిన విధంగానే వ్రాయాలని, ముందుగా పిర్యాదుకు సంబంధం వున్న వారి పేర్లు, సంబంధం లేని వారి పేర్లు పిర్యాదులో వ్రాయించేది, తరువాత ఇలా వ్రాయకూడదు అని పిర్యాదును తిరిగి వ్రాయించేది అక్కడ వున్న పోలీస్ వారేనని, బాధితుడుని బూచిగ చూపించి రక రకాల అవినీతికి మార్గం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. పిర్యాదు పెట్టెలు, పిర్యాదుకు రసీదు ఇచ్చే కౌంటర్లు చూడటానికి మాత్రమే కనపడతాయని, అమలుకు నోచుకోవటం లేదని, పిర్యాదు అంశం ఒకటైతే, రసీదు పట్టికలో మరొకటి రాస్తారని, ఫై అధికారి వద్దకు వెళితే అక్కడ వున్న సి సి వారు అధికారిని కలవనివ్వరిని, స్పందన లోను, జగనన్నకు చెపుదాం అనే కార్యక్రమంలో పిర్యాదు చేస్తే

ఏ విధమైన పరిష్కారం చూపకుండానే 28 గంటల్లో మీ సమస్య పరిష్కరింపబడినది అంటు పిర్యాదు దారుని మొబైల్ కు ఒక మెస్సేజ్ వస్తుందని,ఆ మెస్సేజ్ చుసిన బాధితుడు ఆశ్చర్యానికి గురై ఎప్పుడు పోలీస్ స్టేషన్ కు వెళ్ళకూడదని, ఇది మన కర్మ అని ఏడవాలని నిర్ణయించుకుంటున్నారని ఆయన బాధపడ్డారు. ఒక ప్రాంతంలో రౌడీలు వుంటున్నారని,దొంగలు వుంటున్నారని,అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాలు వుంటున్నాయని,మత్తు ప్రధార్ధాలు వుంటున్నాయని,చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎదేచ్చగా సాగుతున్నాయని అలాంటప్పుడు పోలీస్ వుండి ప్రయోజనం ఏమిటని ఆయన సూటిగా ప్రశ్నించారు.

 

ప్రస్తుతం అమలవుతున్న క్రిమినల్ జస్టిస్ సిస్టం ప్రజా భద్రతకు విరుద్ధంగా అమలు జరుగుతుందని, పాలకుల దాష్టికం కారణంగా నిజాయితీగా విధులు నిర్వహించే పోలీస్ కు విలువలు లేకుండా పోయిందని నేడు పోలీస్ శాఖ ప్రభుత్వ రంగ సంస్థగా కాకుండా ఎవరు అధికారంలో ఉంటే వారికి ప్రయివేట్ సైన్యంగా పనిచేస్తుందని , ఒకప్పుడు పోలీస్ శాఖలో నేరలను అరికట్టె వారికి , క్రమశిక్షణతో విధులు నిర్వహించే వారికి, నేర పరిశోధనను పక్కాగా అమలు చేసిన వారికి, జాతీయ బావలు గల వారికి, సంఘ విద్రోహులను, తీవ్రవాదులను మట్టు పెట్టినవారికి మాత్రమే పోలీస్ పతకాలు, అవార్డులు దక్కెవని, నేడు అందుకు భిన్నంగా అధికారులకు ఎవరైతే ఆడ్రాలి పనులు చేస్తే వారికి మాత్రమే దక్కుతున్నాయని, ప్రస్తుతం రిపబ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పేరిట ప్రకటించే పోలీస్ పతకాలకు, అవార్డు లకు విలువ లేకుండా పోయిందని, పోలీస్ అవార్డులు, పతకాలు అందుకున్న వారందరు తమకు తమ సమర్ధతకే దక్కాయా అనే అనుమానాలు వారికే కలగడం విశేషం అని,పోలీస్ శాఖ ను పూర్తి స్థాయిలో సంస్కరిస్తేనే ప్రజలకు చేరువ ఆవుతుందని అర్పిసి అధ్యక్షులు మేడా శ్రీనివాస్ అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు.

 

సభకు పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు.

 

ఈ సమావేశంలో అర్పిసి సెక్యులర్స్ సర్వశ్రీ డివి రమణ మూర్తి, సిమ్మా దుర్గారావు,దుడ్డే సురేష్,ఎండి హుస్సేన్,వర్ధనపు శరత్ కుమార్,మోర్త ప్రభాకర్,సుంకర వెంకట భాస్కర రంగారావు,జిత్తుక అప్పన్న ,బండారు మహేష్ ,గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బసా సోనియా,బత్తెన శివన్నారాయణ,షేక్ వల్లి, అడపా శేషగిరి,శీరపు నాగేశ్వరి,పసుపులేటి చిరంజీవి, పసుపులేటి వీర్రాజు,సమ్మెంగి తేజ,తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement