పోలీస్ సిబ్బందిని శభాష్రా అంటున్న రామచంద్రపురం పట్టణ ప్రజలు
విశ్వం వాయిస్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో 30.05 .2023 వ తేదీన రామచంద్రపురం పట్టణం చింతపల్లి సూరన్న నగర్ కి చెందిన అయినవిల్లి ప్రసాద్ ఇంటికి తాళం వేసుకుని పని నిమత్తం తణుకు వెళ్లగా,ఆరోజు రాత్రి గుర్తు తెలియని చోరులు ఇంటిలో ప్రవేశించి సుమారు 20 గ్రాముల బంగారం మరియు 30,000/- రూపాయల నగదు దొంగిలించారు అని పిర్యాదు పై రామచంద్రపురం టౌన్ యస్ ఐ డి. సురేష్ బాబు కేసు నమోదు చేసి, రామచంద్రపురం ఎస్ డి పి ఓ టీ. ఎస్. ఆర్. కే. ప్రసాద్ పర్యవేక్షణలో సి ఐ వి.దుర్గారావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి,రాజనగరం మండల పరిధిలోని రాదేయపాలెం గ్రామానికి చెందిన రెడ్డి సురేష్ ని ముద్దాయిగా,నంద్యాల గోవింద రాజు ను రిసీవర్ గా గుర్తించి, అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగలించిన సొత్తును రికవరీ చేసి కోర్టు నందు ప్రవేశపెట్టగా,ట్రయల్ నందు ఏపీపీ కుమారి బి రామ తులసి కృషితో వాదాపు వాదనలు అనంతరం ఏ జె ఎఫ్ సి ఎమ్ ఇంచార్జ్ మెజిస్ట్రేట్ నాగేశ్వర్ నాయక్ సదరు ముద్దాయిలకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు.ఈ కేసు దర్యాప్తులో మరియు ట్రయల్ నందు కృషి చేసిన రామచంద్రపురం ఎస్సై డి సురేష్ బాబు,కోర్టు కానిస్టేబుల్ వెంకట్రాజులును ఎస్ పి ఎస్ శ్రీధర్ ఐపీఎస్ ను అభినందించినారు.
విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం: