విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:
పద్మశాలి సామాజికవర్గ చేతివృత్తులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. స్థానిక మోరంపూడి సమీపంలోని తోటలో ఆదివారం రాజమండ్రి పట్టణ పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన వనసమారాధన కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే గోరంట్ల, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావులు పాల్గొని మాట్లాడారు. పద్మశాలి సేవా సంఘం ప్రతి ఏడాది క్రమం తప్పకుండా వన సమారాధన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు.ఇటువంటి కార్యక్రమాలు సామాజికవర్గంలో ఐక్యతను, చైతన్యాన్ని నింపుతాయన్నారు. పద్మశాలిల కుల వృత్తులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆమంచి ఆంజనేయ గురుస్వామి, మోటూరి చక్రధర్, బండారు సత్తివీర్రాజు, జక్కా మాణిక్యాలరావు, నిలి నాగబాబు, గుండారపు బాబి, జక్కా తాతాజీ, బత్తుల నరసింహరాజు, కొపుల గౌరీ శంకర్, కొప్పుల దినేష్ కుమార్, పిండం అప్పారావు, గుత్తికొండ నాగేంద్ర, అవ్వారి వెంకటేశ్వరరావు, అవ్వారి సత్యనారాయణ, కానూరి సత్యనారాయణ, తాడిశెట్టి శివశంకర్, చీపూరి శ్రీనివాసరావు, గిడితూరి చిట్టిబాబు, గిడుతూరి చిన్న, గిడుతూరి నగేష్, రుక్మాంగరావు, పెద్దఎత్తున సంఫీుయులు పాల్గొని విజయవంతం చేశారు. సంఘానికి సహకరిస్తున్న అమంచి ఆంజేయ గురుస్వామి, జొన్నలగడ్డ రమేష్ తదితరులను సత్కరించారు. పిల్లలు, మహిళలకు ఆటలపోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు.