విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:
తుపాన్ ప్రభావం వలన తడవని తాడిపల్లి గ్రామం రైతుల ధాన్యం
విశ్వం వాయిస్ రామచంద్రపురం తాడిపల్లి,కాపవరం గ్రామాలకు ప్రభుత్వ విధానం వల్ల రైతుకి లాభమేనని,రైతులు ధాన్యం సకాలంలో అమ్ముకున్నారని గోనె సంచులుకు ఏ విధమైన లోటు లేదని తాడిపల్లి కాపవరం యం.పీ.టీ.సీ రెడ్నం సతీష్ తెలియజేశారు.ఆయన బుధవారం కాపవరం,తాడిపల్లి వి ఆర్ ఓ యస్ శ్రావణి, అగ్రికల్చర్ అసిస్టెంట్ మాచవరపు నవ్య సుధ,డేటా ఎంట్రీ ఆపరేటర్ గీసాల మునిశ్వరరావు,హెల్పెర్ కొల్లపు శృతి తో పర్యటించి వర్షానికి తడిసిన ధాన్యపు రాసులు ఏమైనా ఉన్నాయా అని తాడిపల్లి గ్రామ రైతులను అడిగి చూస్తే ఒక ఎకరం కూడా లేదని తెలియజేశారు. తాడిపల్లి రైతులు 316 ఎకారలు రైతు బరోసా కేంద్రంలో ఈక్రాప్ చేయించుకున్నారని, ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా 276 ఎకరాలు ధాన్యం అమ్ముకొన్నారని, రైతు ఎకౌంట్ లో డబ్బులు కూడా పడ్డాయని ఏ ఒక్క రైతు తాడిపల్లి గ్రామంలో తుపాన్ కి దొరకలేదు అని తెలియజేశారు .మిగిలిన రైతుల వద్ద ఉన్న 40 ఎకరాలు కూడా ఏవిధమైన ధాన్యం ఉన్నా సకాలంలో ధాన్యం కొనుగోలు చేయాలని సిబ్బందికి ఎం.పీ.టీ.సీ రెడ్నం సతీష్ తెలియజేశారు.