Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలి – భారత్ ఆదివాసీ పార్టీ డిమాండ్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

18 సంవత్సరాలు నిండిన వారినీ కుటుంబంగా పరిగణలోకి తీసుకుని అర్ అండ్ అర్ ప్యాకేజీ ఇవ్వాలి

విశ్వంవాయిస్ న్యూస్, దేవిపట్నం:

దేవీ పట్నం, విశ్వం వాయిస్ న్యూస్.

 

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా సర్వం కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని భారత్ ఆదివాసీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెల్లం శేఖర్ ఓ ప్రకటనలోడిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా భారత్ ఆదివాసి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెల్లం శేఖర్ మాట్లాడుతూ….పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా త్యాగాలు చేసి సర్వం కోల్పోయిన నిర్వాసితులకు భూమికి భూమి,ఇల్లుకి ఇల్లు,డి.పట్టా భూములకు నష్ట పరిహారం,చెట్లుకు నష్ట పరిహారం,18 సంవత్సరాలు నిండిన వారికి కుటుంబంగా పరిగణలోకి తీసుకుని అర్ అండ్ అర్ ప్యాకేజీ ఇవ్వాలని,గ్రామం ఖాళీ చేసిన రోజును కటాప్ తేదీని పరిగణలోకి తీసుకోవాలి,2013 కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం శాస్త్రీయ సమగ్ర పునరావాసం కల్పించి తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు..ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సమగ్ర న్యాయం చేయకపోవడంతో చిన్న రమణయ్యపేట గ్రామ పంచాయతీలోని నాగళ్ల పల్లి గ్రామస్తుల కొంతమంది,మరియు పూడిపల్లి గ్రామపంచాయతీలోని గొందూరు గ్రామస్తులు, పోచమ్మ గండి గ్రామస్తులు కొంతమంది పాత గ్రామాల్లోనే తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నా రన్నారు.దీనికి కారణం ఆర్ అండ్ అర్ కాలనీలో ఉపాధి లేకపోవడమే కారణం అన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement