Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ సేవలు అద్వితీయం

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– అందరినీ ఆకట్టుకున్న చిత్రకళ ప్రదర్శన..
– గౌరవ డాక్టరేట్ అందుకున్న టీ.కే విశ్వేశ్వర రెడ్డికి ఘన సత్కారం

విశ్వంవాయిస్ న్యూస్, రాజమహేంద్రవరం:

రాజమహేంద్రవరం,విశ్వం వాయిస్ న్యూస్:

క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో “స్పెక్టికల్స్” పేరిట రాజమహేంద్రవరంలో నిర్వహించిన చిత్రకళా ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న అనుపమ గ్రాండ్స్ లో ఆదివారం అట్టహాసంగా జరిగిన ఈ చిత్ర కళా ప్రదర్శనను ఇంటర్నేషనల్ నెయిల్ ఆర్టిస్ట్ డాక్టర్ రవి పరస జ్యోతి ప్రజ్వలన చేయగా,అనుపమ గ్రాండ్ అధినేత వై.త్రినాధ్ మూర్తి ప్రారంభించారు. ప్రముఖ చిత్రకారులు వై. కళాసాగర్ ప్రారంభించిన ఆర్ట్ వర్క్ షాప్ కు పెద్ద ఎత్తున చిత్ర కళాకారులు తరలివచ్చి తమ కళారూపాలను ప్రదర్శించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్,గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు,రాజమహేంద్రి వారసత్వ పరిరక్షణ సమితి

కన్వీనర్ డాక్టర్ టీ.కే విశ్వేశ్వర రెడ్డి పాల్గొని క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ అందిస్తున్న సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. భవిష్యత్తులో ఈ అకాడమీ మరింతగా పురోగతి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు ఆకొండి అంజి

మాట్లాడుతూ తమ సంస్థ అద్వితీయమైన రీతిలో చిత్ర కళాకారులను ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేస్తోందన్నారు. తమ ఆర్ట్స్ అకాడమీ రాష్ట్ర మరియు జాతీయస్థాయిలో చిత్రకళాకారుల ను తీర్చిదిద్ది ప్రఖ్యాతిగాంచినట్లు వివరించారు.ది ఎవల్యూషన్ బోర్డు ఆఫ్ ది బ్రిటిష్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ క్వీన్ మేరీ నుంచి ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్న టీకే విశ్వేశ్వర్ రెడ్డి ని సంస్థ తరఫున ఘనంగా సత్కరించారు. సమాజానికి ఆయన అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా ప్రశంసించారు.అలాగే ప్రతిభను కనబరిచిన చిత్రకళాకారులను టీకే విశ్వేశ్వర రెడ్డి చేతుల మీదగా అంజి ఆకొండి సత్కరించారు.ఈ కార్యక్రమం లో మరొక సందర్భం చిత్రకళాకారిణి పట్నాల రాధారాణి 5 నిమిషాలలో అతి తక్కువ సమయంలో స్పాట్లో పాత్రికేయుల చిత్రాలను గీసి ఆమె ప్రత్యేక ప్రతిభను కనబరిచారు. ఆమెను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు చిత్ర కళాకారులు,పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement