WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

పీడీఎస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని పోస్టర్స్ ఆవిష్కరణ

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, రామచంద్రపురం:

 

రామచంద్రపురం విశ్వం వాయిస్ న్యూస్ శాస్త్రీయ విద్యాసాధన కై,ప్రభుత్వ విద్యా పరిరక్షణకై నిరంతరం ఉద్యమిస్తున్న పీడీఎస్ యూ విద్యార్థి సంఘం ఈనెల 29న విజయవాడలో రాష్ట్ర స్థాయి జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని పి.డిఎస్.యు నాయకులు బి.సిద్ధూ పిలుపునిచ్చారు. ఈసందర్భంగా రామచంద్రపురం పట్టణం లో స్థానిక ఎస్.సి అంబేద్కర్ బాయ్స్ కళాశాల హాస్టల్ లో పీ డీ ఎస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పోస్టర్స్ ఆవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా బి.సిద్ధూ మాట్లాడుతూ 1974లో ఏర్పడిన పీడీఎస్ యూ స్వేచ్ఛ,సమానత్వం కోసం, శాస్త్రీయ విద్యాసాధన కొరకు నూతన ప్రజాస్వామిక వ్యవస్థ నిర్మాణం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు.ఈ క్రమంలోనే జార్జి రెడ్డి ,జెసిఎస్ ప్రసాద్,కోలా శంకర్,శ్రీపాద శ్రీహరి, చేరాలు తదితరులు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నిర్మాణం కోసం రాజ్యంతో పోరాడి తమ ప్రాణాలను అర్పించారని అన్నారు. వారు అందించిన విప్లవస్ఫూర్తితో విద్యార్థుల హక్కులకై రాజీలేని పోరాటాలను నిర్వహిస్తోందని తెలిపారు. ఈక్రమంలోనే సంస్థ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు పిడిఎస్ యు రాష్ట్రస్థాయి జనరల్ కౌన్సిల్ సమావేశాలు జూన్ 29న విజయవాడలో జరుపుకోవాలని పిడిఎస్ యు రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను హక్కుగా బాధ్యతగా ప్రజలకు అందరికీ అందిస్తామని చట్టం చేశారు తప్ప దాన్ని అమలుకు నోచుకోలేదని . కేంద్రంలో మోదీ ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి వాటిని నేడు బ్రాహ్మణీయ భావజాలంగా విశ్వవిద్యాలయాలను అగ్ర హారాలుగా మారుస్తున్నారని అన్నారు. నూతన జాతీయ విద్యా విధానం పేరుతో బ్రాహ్మణీయ భావజాలాన్ని విద్యార్థుల మెదడులో చెప్పించేందుకు బిజెపి ప్రభుత్వం చాప కింద నీరులా తమ మనువాద భావజాలాన్ని పాఠ్యాంశాలలో ముద్రిస్తున్నారని అన్నారు. భవిష్యత్ తరాలకు వైద్యం అందించే నీట్ ఎంట్రన్స్ వంటి జాతీయ పరీక్షలకు పేపర్ లీకులు,ఫలితాల్లో గందరగోళం సృష్టిస్తూ విద్యార్థులను భయభ్రాంతులకు గురి చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విభజన హామీలు,కేంద్రీయ విద్యాసంస్థల ఏర్పాటు పైన,విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకై పి డి ఎస్ యు ముందుండి పోరాడిందన్నారు.అలాగే సంక్షేమ హాస్టల్స్ ప్రభుత్వ పాఠశాలలు ఉన్నత సాంకేతిక విద్యాసంస్థల్లో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలపై భవిష్యత్ కార్యక్రమం రూపొందించి, విద్యార్థులను చైతన్యపరిచి ఉద్యమించేందుకు సన్నద్ధం చేస్తోందన్నారు.పీడీఎస్ యూ తన సంస్థ నిర్మాణాన్ని మరింత పటిష్ట పరిచేందుకు జూన్ 29న విజయవాడలో జరుగు రాష్ట్రస్థాయి జనరల్ కౌన్సిల్ ను జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో రామచంద్రపురం పీడీఎస్ యూ నాయకులు ఎస్. సుబ్బారాయుడు,హర్ష, పీ.బాలాజీ, సి.హెచ్.లక్ష్మణ్, ఎస్.సూర్య,జీ.అజయ్, వి.తరణ్,ఎస్.పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement