Asset 2

Trending

Trending

8:10:45

దేశంలో ప్రస్తుత కరోన వివరాలు

RECOVERED

ACTIVE

DEATHS

Follow Us

ముంపు బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

విశ్వంవాయిస్ న్యూస్, కాజులూరు:

ముంపు బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

 

 

విశ్వం వాయిస్ న్యూస్ కాజులూరు మండలంలో రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా కౌలు రైతుల సంఘం వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసారు.కాజులూరు మండలంలో చేదువాడ, కాజులూరు,దుగ్గుదురు, ఉప్పుమిల్లి గ్రామాల్లో డ్రైన్ లో వెంబడి ఉన్న పంట పొలాలు పరిశీలించారు. ఈ సందర్బంగా పంట పొలాలు మునిగిపోవడంతో కౌలు రైతుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్ , రాజబాబు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు టేకుమూడి ఈశ్వరరావు,కే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం డ్రైన్ల ఆధునికీకరణకు మెగ్గు చూపకపోవడంతో ఇటీవల కురిసిన వర్షాలకు డ్రైన్ లలో నీరు నిలిచి పోయిందన్నారు.అందువల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు.డ్రైన్ల వెంబడి ఉన్న పంట పొలాలు 15000 రూపాయలు పెట్టుబడులు పెట్టి ఉన్నారని తీవ్ర నష్టం జరిగిందని తెలియజేసారు.ప్రభుత్వం వెంటనే స్పందించి వీరిని ఆదుకోవాలని,అలాగే విత్తనాలు ఎరువులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు.దుగుదురు కాజులూరు మధ్య ఉన్న అండ్రంగి డ్రైన్ పై ఉన్న వంతెన శిధిలం కావడంతో తాత్కాలికంగా నిర్మించిన వంతెన పైనుండి నీరు ప్రవహిస్తున్నంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి వంతెన నిర్మించి కరకట్టు తొలగించి అటు రైతులకు నష్టం రాకుండా ఇటు ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తక్షణమే వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో రైతులు కౌలు రైతులు పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement