విశ్వంవాయిస్ న్యూస్, రాయవరం
ఘనంగా రాయవరంలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి…
రాయవరం, విశ్వం వాయిస్ న్యూస్: మండల కేంద్రమైన రాయవరం గ్రామ వైసిపి నాయకులు తేతలి సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 15వ వర్థంతి ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా పలువురు మాట్లాడుతూ 1978లో తొలిసారిగా పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభలో అడుగుపెట్టిన రాజశేఖరరెడ్డి మొత్తం 6 సార్లు పులివెందుల నుంచి ఎన్నిక కాగా, 4సార్లు కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటులో అడుగుపెట్టాడు. ఆయన పోటీచేసిన ప్రతి ఎన్నికలలోనూ విజయం సాధించారని తెలియజేసారు.
1989-94 మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించినా అవకాశం రాలేదు.1999లో మళ్ళీ శాసనసభకు ఎన్నికై ప్రతిపక్షనేతగా ఉంటూ తదుపరి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వ్యూహం రచించాడు. 2003లో మండు వేసవిలో 1460 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర చేసి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రచారం అతని విజయానికి బాటలు వేశారన్నారు.
2004 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గం నుంచి 40వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించడమే కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు పొందడంతో ముఖ్యమంత్రి పీఠం వై.ఎస్.రాజశేఖరరెడ్డికే దక్కింది. ఆయన సెప్టెంబర్ 2, 2009న చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి హాజరవడానికి వెళ్తూ నల్లమల అడవులలో హెలికాప్టర్ ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యాడని తెలియజేసారు. ఈకార్యక్రమంలో ఎంపిపి నౌడు వెంకటరమణ, గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ, రాయవరం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తమలంపూడి గంగాధర్ రెడ్డి, గ్రామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తేతలి సుబ్రామిరెడ్డి,మాజీ ఏఎమ్సి చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు,మాజీ ఉప సర్పంచ్ బొడ్డు శ్రీను,గ్రామ నాయకులు కొల్లు రాంబాబు,పిఎస్ఆర్, అడ్వకేట్ సురేష్ కుమార్,మందపల్లి కొండలరావు,చంద్రమళ్ళ చిన్నవీరన్న,తదితరులు పాల్గొన్నారు.