🔔 10
Latest Notifications
🔔 10
Latest Notifications
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి

ఆంధ్రప్రదేశ్

అక్కర సమయంలో “శక్తి యాప్” అండగా నిలుస్తుంది

మహిళలు పోలీస్ స్టేషన్ వెళ్లకుండానే యాప్ ద్వారా సమస్యపై ఫిర్యాదు చేయవచ్చు  ఆపదలో బంధువులు తోడు ఉన్నా లేకపోయినా,శక్తి యాప్ ద్వారా సదా మీ సేవలో పోలీసులు శక్తి యాప్ అవగాహన సదస్సులో ట్రైనీ అడిషనల్ డి.ఎస్పీ ప్రదీప్తి విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, , రాయవరం ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, ఉద్యోగం, ఉపాధి, ఇతర పనుల నిమిత్తం బయటకు వెళ్లే మహిళలు, విద్యార్థినిలు, తమ ఇళ్లకు సురక్షితంగా చేరుకునే ప్రయాణంలో శక్తి యాప్‌ తోబుట్టువు లా ధైర్యం కలిగించి,కాపాడుతుందని ట్రైనీ అడిషనల్ డి.ఎస్పి ప్రదీప్తి తెలిపారు. సోమవారం మండల కేంద్రమైన రాయవరం శ్రీ రామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమావేశ మందిరం నందు, మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు ఆధ్వర్యంలో, రాయవరం ఎస్సై డి.సురేష్...

బూత్ స్థాయి అధికారుల జాతీయ శిక్షణా కార్యక్రమం

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, ,రాయవరం బూత్ స్థాయి అధికారుల జాతీయ శిక్షణా కార్యక్రమంలో భాగంగా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.ఆర్.ఆర్.సి, ఓటరు నమోదు అధికారి పి.కృష్ణమూర్తి ఆద్వర్యంలో మండల కేంద్రమైన రాయవరంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో గల మీటింగ్ హాల్ నందు, నెంబర్ 48 మండపేట అసెంబ్లీ నియోజక వర్గానికి సంబంధించి సోమవారం 113 నుండి 157 వరకూ ఉన్న పోలింగ్ స్టేషన్ లకు చెందిన బూత్ లెవెల్ అధికారులకు, న్యూఢిల్లీ వెళ్ళి శిక్షణ పొంది వచ్చిన, మండపేట మండలం ఏడిద సచివాలయ వెల్ఫేర్,ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మాస్టర్ ట్రైనర్ నాగం నాగ శివ ద్వారా బూత్ లెవెల్ అధికారులకి సంబంధించిన ఎన్నికల విధులు,బాధ్యతలు, ఫారం-6, 6ఎ, 7, 8,...

గురుపూజోత్సవం సందర్భంగా వెదురుపాక “గాడ్” ను దర్శించుకున్న ఎంపీ పురందేశ్వరి

విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, రాయవరం రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో ప్రసిద్ధి చెందిన విజయదుర్గ పీఠాధిపతి గాడ్ ను,గురుపూజోత్సవం సందర్భంగా, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు, మాజీ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందరేశ్వరి గురువారం దర్శించుకుని, ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయనతో చర్చించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ, మండపేట నియోజవర్గ కన్వీనర్ కెవివి సాయిరాం,అనకాపల్లి ఇంచార్జ్ కర్రి చిట్టిబాబు, రాయవరం మండల బిజెపి అధ్యక్షులు శాకా దుర్గా శ్రీనివాస్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు లొల్ల గ్రామ సర్పంచ్ చాట్రాతి జానకి రాంబాబు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నరాల రాంబాబు జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ చీరట్ల సుబ్బారావు, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి...

యవ్వన దశలో వేసే అడుగులే జీవితాన్ని నిర్ణయిస్తాయి

రాయవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ఘనంగా మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ 2.0  ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ జి.యస్.ఎన్ రెడ్డి, ఉండవల్లి రాంబాబు.. విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, ,రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో గల  ప్రభుత్వ జూనియర్ కళాశాలనందు మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ ను స్పెషల్ ఆఫీసర్ బి.ఈశ్వరి ఆధ్వర్యంలో, కళాశాల ప్రిన్సిపాల్ ఎం రామారావు అధ్యక్షతన గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాయవరం గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్,ఉండవల్లి రాంబాబు చాణిక్య హాస్పిటల్ అధినేత డాక్టర్ జి ఎస్ ఎన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యవ్వన ప్రాయంలో,ప్రప్రదమైన దశకు విద్యార్థులుగా చేరుకున్నారని, జీవితం పూలబాటగా సాగాలన్నా,...

తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనమే మెగా పేరెంట్స్ మీట్

ఆటలు,సాంస్కృతిక కార్యక్రమాలతో కన్నుల పండువగా సాగిన మెగా పి.టి.ఎమ్ 2.0 తల్లిదండ్రులు నెలకు ఒకసారైనా పాఠశాలను సందర్శించండి మెగా పేరెంట్స్-టీచర్స్ మీట్ లో ప్రధానోపాధ్యాయురాలు శాంతి సునీత విశ్వం వాయిస్ న్యూస్, , రాయవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ, ప్రత్యేక ఆఫీసర్ సారథ్యంలో, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు,జూనియర్ కళాశాలలలో గురువారం మెగా పేరెంట్-టీచర్ మీట్ 2.0 (మెగా పి.టి.ఎమ్ 2.0)ను ఘనంగా నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సందడి వాతావరణం నెలకొనగా, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొని, పాఠశాలలో చదువుతున్న తమ పిల్లల విద్యా,విధానాలపై అవగాహన పొందడానికి మంచి వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో శ్రీ...

రేపు మండల వ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం

విశ్వం వాయిస్ ప్రాంతీయ డెస్క్, ,రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలంలోని సోమేశ్వరం, మాచవరం, పసలపూడి, చెల్లూరు, వెంటూరు, రాయవరం తదితర గ్రామాలకు జూలై 11వ తేదీ శుక్రవారం ఉదయం 09:00 గం! నుండి మధ్యాహ్నం 01:00 గం!ల వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడుతుందని, రామచంద్రపురం ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ కె.రత్నాలరావు గురువారం ప్రకటన ద్వారా తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తులు,చెట్లుకొమ్మలు తొలగించడం,సోమేశ్వరం సబ్ స్టేషన్  పరిధిలో 11 kv మాచవరం ఫీడర్, పసలపూడి సబ్ స్టేషన్ పరిధిలో పసలపూడి టౌన్ ఫీడర్, వెంటూరు సబ్ స్టేషన్ పరిధిలో, వెంటూరు ఇండస్ట్రియల్ ఫీడర్ మరమ్మత్తులు,మెయింటనెన్స్ నిమిత్తం.విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

ఎమ్మెల్యే వేగుళ్ళ ను కలిసిన పి.ఎ.సి.ఎస్ చైర్మన్ లు, మెంబర్లు

విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, , రాయవరం మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం, మాచవరం, పసలపూడి, మండపేట ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) చైర్మన్ లు గా నియమితులైన మేడపాటి రవీంద్రరెడ్డి, సత్తి వెంకట కృష్ణారెడ్డి, కుక్కల రామారావు లు బుధవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిసారు. తనపై నమ్మకంతో పిఎసిఎస్ చైర్మన్ లు గా నియమించిన ఎమ్మెల్యే వేగుళ్ళ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పిఎసిఎస్ చైర్మన్ లు, మెంబర్లు గా నియమితులైన వారందరినీ ఎమ్మెల్యే వేగుళ్ల దుశ్శాలువాతో సత్కరించారు. మాచవరం పిఎసిఎస్ మెంబర్లు గా తిపర్తి శ్రీరమేష్, మోర్త దావీదు లు, పసలపూడి పిఎసిఎస్ మెంబర్లు...

“అన్నదాత సుఖీభవ” వివరాలు వాట్సాప్ ద్వారా పొందవచ్చు

మనమిత్ర వాట్సాప్ ద్వారా అన్నదాత సుఖీభవ రైతులు జాబితాను పొందే అవకాశం తుది జాబితాలో పేరులేని అర్హులైన రైతులు రైతు సేవ కేంద్రంలో గ్రీవెన్స్ నమోదు చేసుకోవచ్చు వ్యవసాయ అధికారి రమేష్ కుమార్ విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, , రాయవరం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాయవరం మండలం రాయవరం, వి.సావారం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి కెవిఎన్ రమేష్ కుమార్ తెలిపారు, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులైన రైతుల జాబితా రైతు సేవ కేంద్రంలో అందుబాటులో ఉందని, "మన మిత్ర వాట్సప్ " ద్వారా కూడా లబ్ధిదారుల సమాచారం తెలుసుకునే వెసులుబాటు ఉందని సూచించారు, తుది జాబితాలో పేర్లు లేని అర్హులైన...

పంచాయతీ పురోగతి సూచిక 2.O శిక్షణా కార్యక్రమం

 శిక్షణలో పాల్గొన్న పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఏ.ఎన్.ఎం లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు  ఎ గ్రేడ్ సాధించడమే లక్ష్యంగా పంచాయతీలను అభివృద్ధి చేయాలి ఎంపీడీవో కీర్తి స్పందన సూచన విశ్వం వాయిస్ న్యూస్ డెస్క్, , రాయవరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరంలో మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో, ఎంపీడీవో కీర్తి స్పందన ఆద్వర్యంలో,మండల పరిషత్ అధ్యక్షులు నౌడు వెంకటరమణ అధ్యక్షతన "పంచాయతీ పురోగతి సూచిక" 2.O కార్యక్రమంలో భాగంగా గ్రామపంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఏ.ఎన్.ఎం లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని  నిర్వహించారు, ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి కార్యక్రమాల పై చర్చించారు, పంచాయతీల పనితీరుపై గ్రేడ్లు నిర్వహించ బడతాయని ఎ గ్రేడ్ సంపాదించిన...

పసివారిపై ప్రైవేటు పాఠశాలల జులుం , చోద్యం చూస్తున్న అధికార గణం

విద్యా హక్కు చట్టానికి తూట్లు..కక్కలేక మింగలేక తల్లిదండ్రుల పాట్లు అధిక ఫీజు పై తల్లిదండ్రులు చేసిన పోరాటమే, వారి పిల్లల పాలిట శాపం అధికారుల అండతోనే ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు పెట్రేగిపోతున్నాయని తల్లిదండ్రుల ఆరోపణ విశ్వం వాయిస్ కథనంతో, తల్లిదండ్రులపై కక్ష కట్టిన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం విద్యాహక్కు చట్టం 12 (1)సి ప్రకారం ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు ప్రైవేట్ పాఠశాలలు పాటించాలని పదేపదే చెబుతున్నప్పటికీ, పలుచోట్ల ఆ మాటలు కేవలం కాగితాల మీద అక్షరాల గానో,లేక నోటి మాటగానో ఆగిపోతున్నాయి, కాని అమలుకు నోచుకోవడం లేదు ప్రైవేటు పాఠశాలల ఆగడాలు మితిమీరిపోయి ఇబ్బంది పడుతున్నామని, అధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన కారణానికి, అభం శుభం తెలియని పసివారి ని సైతం వేధించడాని కి వెనకాడని పరిస్థితి దాపురించింది. అధికారుల చేతకానితనమో, లేక  ప్రైవేటు యాజమాన్యాల కాసుల మహిమో, కారణం ఏదైనా  పసివారి...
టెలిగ్రామ్
తాజా అప్డేట్స్ కోసం — మన టెలిగ్రామ్ చానల్‌లో చేరండి
చేరండి
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

తాజా వార్తలు

Left Ad
Right Ad
Logo