కాకినాడసిటీ:విశ్వం వాయిస్ న్యూస్
కైట్ ఇంజనీరింగ్ కాలేజీలో 2006 సంవత్సరం విద్యార్థి సరగం శ్రీధర్ ఆయన కైట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఒక అమెరికన్ కంపెనీకి వైస్ చైర్మన్ గా ఉంటూ గడిచిన 19 సంవత్సరాలలో ఎంతో మంది ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకు వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించారని అటువంటి వ్యక్తి ఈరోజు కైట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు తన ఎదుగుదలను వివరించి వారిని కూడా మంచి ప్రయోజకులను చెయ్యాలని ఉద్దేశంతో వారికి ఇంటర్వ్యూలో ఏ విధంగా సమాధానాలు చెప్పాలి అనే దానిపై సుమారు 400 మంది విద్యార్థులకు అవగాహన కల్పించారనీ ప్రస్తుతం శ్రీధర్ సాఫ్ట్వేర్ కంపెనీల అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీగా ప్రభుత్వం తరఫున ఎక్కడైనా ఉద్యోగ...
ఆర్.వి.ఎన్. సదస్సు లో వక్తలు
వ్యవసాయం, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు తోడ్పాటుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
కాకినాడ సిటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన విజన్ - 2047 డాక్యుమెంట్ కార్పోరేట్ల ప్రయోజనం కోసమే తయారు చేయబడిందని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ డా. బి. గంగారావు తెలిపారు.
శనివారం సాయంత్రం కాకినాడ యుటిఎఫ్ హోం లో రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో "విజన్ 2047 - ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి" అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్తిరాజు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో గంగారావు ముఖ్యవక్తగా ప్రసంగించారు. 229 పేజీలు గల ఎపి విజన్ డాక్యుమెంట్, కేంద్ర బిజెపి వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా...
కాకినాడ
పాత్రికేయులు వృత్తిధర్మంతో పాటు తమ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని డా.ఓబుల్ రెడ్డి హెల్త్ కేర్&మల్టిస్పెషాలిటి సెంటర్ అధినేత,గుండెవ్యాధి నిపుణులు డా.గజ్జల ఓబుల్ రెడ్డి,జనరల్ సర్జన్ డా.మల్లాడి భార్గవి సూచించారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రెడ్డిపల్లి రాజేష్, కార్యదర్శి మోహన్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సభ్యులు,వారి కుటుంబ సభ్యులకు స్థానిక భానుగుడి వద్దగల జన్మభూమి పార్కు సమీపంలోని హెల్త్ కేర్ సెంటరులో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.తొలివిడతలో ముందుగా పేర్లు నమోదు చేసుకున్న సుమారు 50మంది పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన వైద్య సలహాలతో బాటు అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.రక్త,షుగర్,బీపీ టెస్ట్, 2డి ఎకో గుండె పరీక్షలు, గుండె...