వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గా మండపేట కు చెందిన ఎర్రగుంట మణికంఠ కుమార్ (అయ్యప్ప) నియమితులయ్యారని పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనని నియమించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ,మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ , రాష్ట్ర సబర్డినేట్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు.తనకు ఇచ్చిన ఈ బాధ్యతను 2029 లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి శాయశక్తుల కృషి చేస్తానని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి వైయస్సార్ పార్టీ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి తన వంతు తొర్పడుతానని అన్నారు. ఈయన నియామకం పట్ల వైసిపి అర్ టి ఐ విభాగం చైర్మన్, కౌన్సిలర్ మందపల్లి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు.