20 October 2025
Monday, October 20, 2025

విస్పోటనం జరిగి వారం, బాధితులకు ఏది పరిహారం.?

Share
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి

యాజమాన్యం, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పదిమంది కార్మికుల మృతి

అండగా ఉంటామని నాయకుల నోటిమాట, అర్థం కాని కూటమి ప్రభుత్వ పోకడ

శనివారం లోపు పరిహారం ప్రకటించక పోతే, బాధిత కుటుంబాలతో కలిసి ఉద్యమం బాట.

పీ.డీ.ఎస్.యూ, ఏ.ఐ.కె.ఎం.ఎస్, ఎం.ఆర్.పి.ఎస్., ఎస్.సీ, బీ.సీ, మైనార్టీ ప్రజా సంఘాల హెచ్చరిక

విశ్వం వాయిస్ న్యూస్, రాయవరం

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండల కేంద్రమైన రాయవరం గ్రామ శివారులో శ్రీ గణపతి ఫైర్‌వర్క్స్ బాణాసంచా తయారీ కర్మాగార కేంద్రంలో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకమని, ఘటన జరిగి వారం రోజులు గడిచినా నష్టం పరిహారం పై ప్రకటన లేని ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీ.డీ.ఎస్.యూ, ఏ.ఐ.కె.ఎం.ఎస్., ఎం.ఆర్.పి.ఎస్., ఎస్.సీ, బీ.సీ, మైనార్టీ ప్రజా సంఘాలన్నీ కలిసి రాయవరం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి. సిద్ధూ, ఎం.ఆర్.పీ.ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ధూళి జయరాజు, రైతు కూలీ సంఘం నాయకులు వెంటపల్లి భీమశంకరం, ప్రజా సంఘాల నాయకులు తమ ఆవేదనను వెలిబుచ్చుతూ, అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన మృతుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉండగా వీరంతా ఎస్.సీ, బీ.సీ, ఓ.సీ సామాజిక వర్గాలకు చెందిన పేద కుటుంబాల వారేనని, ఈ ప్రమాదంలో సోమేశ్వరం గ్రామానికి చెందిన పాకా అరుణ (35), వాసం శెట్టి విజయలక్ష్మి (45), అనపర్తి–సావరం గ్రామానికి చెందిన కుడిపూడి జ్యోతి (38), పెంకే శేషా రత్నం (35), అనపర్తి గ్రామానికి చెందిన చిట్టూరి శ్యామల (35) చిట్టూరి యామిని (30), వేండ్ర గ్రామానికి చెందిన లింగం వెంకట కృష్ణ (22), కొమరిపాలెం గ్రామానికి చెందిన పొట్నూరి వెంకట రమణ(55)లు మరణించగా, వీరు పరిశ్రమ యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణ (65) నిర్లక్ష్యం వల్లనే మరణించారని ఆరోపిస్తూ, దీపావళి పండుగ సమీపంలో అధిక ఉత్పత్తి కోసం భద్రతా ప్రమాణాలు విస్మరించడం వల్లే ఈ దుర్ఘటన జరిగి ఆయన కూడా మరణించారన్నారు. రెవెన్యూ, కార్మిక, పరిశ్రమల, అగ్నిమాపక శాఖలు నిరంతర పర్యవేక్షణలో విఫలమయ్యాయని నిందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా యజమానులు, అధికారులపై కఠినచర్యలు తీసుకోవాలని నినదించారు. కాగా ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఘటన స్థలాన్ని సందర్శించినప్పటికీ, వారం రోజులు గడిచినా ప్రభుత్వం ఇప్పటివరకు నష్టపరిహారం ప్రకటించకపోవడం తీవ్ర ఆవేదన కలిగించే అంశం అని తెలిపారు. శనివారం లోపు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం ప్రకటించాలని లేని పక్షంలో బాధిత కుటుంబ సభ్యులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ, పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రాయవరం మండల తహశీల్దార్ బి.వి భాస్కర రావు కు ప్రజా సంఘాలు నాయకులు అందించారు. ఈ కార్యక్రమంలో ఐ.ఎఫ్.టీ.యూ నాయకులు చింతా రాజా రెడ్డి, మండపేట ముస్లిం (జెఏసీ) నాయకులు ఎమ్.డీ కరీం, ఎం.డీ షఫీ, బీ.సీ సెల్ (జెఏసీ) నాయకులు ఎం.గణపతి రావు, రాయవరం గ్రామ సర్పంచ్ చంద్రమళ్ళ రామకృష్ణ, లంక రాజేష్, సీపీఐ నాయకులు చిర్రా జోజీ బాబు, పీ.డీ.ఎస్.యూ నాయకులు కె.నవీన్, లంక పుత్రయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

రచయిత నుండి మరిన్ని

సంబంధిత వార్తలు

For Ads
ఆంధ్రప్రదేశ్
సాధారణ వార్తలు
అంబేద్కర్ కోనసీమ
కాకినాడ
రాజకీయాలు
క్రైమ్ వాయిస్
తూర్పు గోదావరి
విద్య వాయిస్
ఆధ్యాత్మికం
కిసాన్ వాయిస్
హెల్త్ వాయిస్
పండుగలు
సక్సెస్ వాయిస్
అలూరి సీతారామరాజు
తెలంగాణ
ఎడిటర్ వాయిస్
సినీ వాయిస్
టెక్నాలజీ
క్రీడా వాయిస్
తీర్పు వాయిస్
For Ads
📰
విశ్వం వాయిస్ తెలుగు దినపత్రికను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
క్లిక్ చేయండి
తాజా వార్తల అప్‌డేట్ కోసం చానల్‌లో చేరండి

తాజా వార్తలు

✅ Message cleared
Left Ad
Right Ad
Logo