మండలంలో అక్రమార్కులకు కల్పతరువుగా జలధార జలహారతి

0
44

📰 Generate e-Paper Clip

– అనుమతులు గోరంత-తవ్వేది కొండంత
– నిబంధనలకు తూట్లు- మొద్దు నిద్రలో ఇరిగేషన్
కోరుకొండ మే 17 (విశ్వం వాయిస్ న్యూస్)  : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జలధార-జలహారతి కార్యక్రమం కోరుకొండ మండలంలో అక్రమార్కులకు కల్పతరువుగా లక్షలాది రూపాయలు తేచ్చి పెడుతుందని పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామాల రైతులు వాపోతున్నారు. మండలంలోని నిడిగట్ల గ్రామానికి చెందిన తల్లప్ప చెరువులో గత 20 రోజుల నుండి నిబంధనలకు విరుద్ధంగా భారీ యంత్రాలతో సమయ భావం లేకుండా అక్రమార్కులు యదేచ్చగా నిబంధనలకు తూట్లు పొడుస్తూ లేఔట్లకు తరలిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ చెరువులో పదివేల క్యూబిక్ మీటర్లకు మాత్రమే అనుమతులు తీసుకొని, పెద్ద ఎత్తున తవ్వకాలు సాగిస్తున్నారు. కోరుకొండ మండలంలో జలధార- జలహారతి కార్యక్రమం ద్వారా నీటి వనరుల సంరక్షణ మాట ఎలా ఉన్నా, అక్రమార్కులకు ఎన్డీఏ కూటమిలో కొద్దిమంది కార్యకర్తలకు లక్షలాది రూపాయలు తెచ్చిపెడుతుందని పలు గ్రామాల ప్రజలు, అధికార కూటమికి చెందిన నాయకులు బహిరంగంగా పోతున్నారు. ఇంత తతంగం జరుగుతున్న రెవెన్యూశాఖ పనితీరు తామరాకు మీద నీటి బొట్టుల ఉంటుందని, ఇక ఇరిగేషన్ అధికారులు గోరంత అనుమతులు ఇచ్చి, కొండంత ఎత్తున తవ్వకాలు జరుగుతున్న కానరాకపోవడం, అధికారులు ఉదాసీనత వెరసి, పలు అనుమానాలను బలపరుస్తుందని పలువురు ప్రజాప్రతినిధులు రైతులు అంటున్నారు. ఇక సమయభవం లేకుండా పది చక్రాల లారీలు దుమ్ము రేపుతూ, ప్రజల గుండెల్లో రేయింబవళ్లు రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.

దీంతో వివిధ గ్రామాలలో ప్రజలు ప్రాణాలను అరి చేతిలో పెట్టుకొని, పనులు ముగించుకుంటున్నామంటున్నారు. రాత్రి వేళల్లో వాహనాలు పై పరిమితికి మించి మట్టిని తరలిస్తున్న రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు వ్యవస్థలు మొద్దు నిద్ర నటిస్తూ, అక్రమార్కులకు అండగా నిలుస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలం నుండి అక్రమార్కులు మట్టిని నర్సరీలకు, బట్టీలకు, రియల్ ఎస్టేట్ లకు వాహనాల్లో పరిమితికి మించి తరలించడంతో వాహనాలలో మట్టి ఎవరిమీద పడుతుందో అని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మండలంలో కొన్నిచోట్ల ఎటువంటి అనుమతులు లేకుండా పొలాలను లేఔట్ లుగా మారుస్తూ, మట్టి అక్రమార్కుల అండదండలతో సైట్ ఫీలింగ్ చేస్తూ లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. జలధార జలహారతి కార్యక్రమాన్ని అక్రమార్కులు రైతుల ముసుగుతో పెద్ద ఎత్తున 10 టైర్ లారీలు, ట్రాక్టర్లతో రియల్ ఎస్టేట్ కు పెద్ద ఎత్తున తరలిస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. జలధార జలహారతి కార్యక్రమాల్లో సాగునీటి సంఘ సభ్యులు, అఖిలపక్ష నాయకులు, రైతులు, గ్రామస్తులకు తెలియజేయకుండానే ఏకపక్ష అనుమతులతో విచ్చలవిడి త్రవ్వకాలు జరుగుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు నటిస్తున్న మొద్దు నిద్ర వీడి, చినుకులు పడక ముందే వివిధ చెరువుల్లో అనుమతులకు మించి తవ్విన తవ్వకాలను నమోదు చేసి, వారు వద్ద నుండి పెనాల్టీలతో అదనపు సొమ్ములు కట్టించుకోవాలని, పలువురు ఎన్డీఏ నాయకులు, రైతులు గ్రామస్తులు అంటున్నారు. మరి అధికారులు స్పందిస్తారో, ప్రజా ప్రతినిధులకు వత్తాసు పలుకుతూ కాన రాలేదంటారో వేచి చూద్దాం.

Leave a reply

Please enter your comment!
Please enter your name here