గోకవరం మండల కేంద్రంలో మంగళవారం ఉష్ణోగ్రతకు తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోయారు. ప్రధాన రహదారులన్నీ నిర్మానుషంగా మారాయి అధిక ఉష్ణోగ్రత కారణంగా వాహనదారులు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణించారు. గత కొన్ని రోజులుగా బొగ్గు మంటున్న ఎండల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాలు పడతాయేమోనని ఆశగా ఆకాశం వైపు ఎదురుచూపులు చూస్తున్నారు.

