– రాష్ట్రసమాచార శాఖ మంత్రి శ్రద్ద వహించి కాకినాడ ప్రెస్ క్లబ్ భవనం
– డి పి ఆర్ వో భవనం- కమ్యూనిటీ హాలు నిర్మాణానికి స్థల సేకరణ చేపట్టి నిధులు కేటాయించాలి
– పౌరసంక్షేమసంఘం డిమాండ్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
పాత్రికేయవృత్తి అంటేప్రజాహిత మైన ప్రతి అంశాన్ని ఆరాతీసి వెలుగులోకి తేవడమేననివృత్తి ఆరాధనగా జర్నలిజం వుండాలని అటువంటి పాత్రికేయ సంక్షేమ పట్ల ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ద బాధ్యత వహించాలని పౌర సంక్షేమసంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. రాష్ట్ర సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ మీడియాలో మాట్లాడుతూ పాత్రికేయులు ప్రభుత్వాలను పాలకు లను ఆరాధించడం నేర్చుకోవాలన్నట్లుగా ఆరాధిస్తేనే పనులు జరుగుతాయన్నట్లుగా ఆరా తీయడం వలన ప్రయోజనం లేదని పేర్కొనడం హాస్యా స్పదంగా ఉందన్నారు. స్థానిక జిల్లా కు చెందిన రాష్ట్రసమాచార శాఖ మంత్రి పాత్రికేయు లకు దక్కాల్సిన రాయితీలు ప్రెస్ అక్రిడి యేషన్ మంజూరు చేయడంతో బాటుగా కాకినాడలో ప్రెస్ క్లబ్ భవనం.. జిల్లా పౌరసంబంధాల శాఖ కార్యాలయ భవనం.. ప్రెస్ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి స్థలం సేకరించి నిధులు కేటాయించాలని కోరారు.