విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అంబాజీపేట:
అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్ )
ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భముగా సోమవారం అంబాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ గౌతమి, మరియు శ్రీనివాస్ ముక్కామల పి హెచ్ సి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమల ద్వారా ముఖ్యంగా ఐదు రకాలైన వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నాయని, అవి మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ, చికున్గున్యా, మెదడువాపు వ్యాధి అని తెలిపారు. వీటిని రాకుండా నివారించేందుకు గాను ఇంటి పరిసరాల్లో దోమలు ఆవాసాలను ముందుగా నిర్మూలించాలని అన్నారు. దోమలు ఎక్కువగా ఇంటి పరిసరాల్లోని నీటి ఆవాసాలలోనూ, ఇంటిలో నిల్వలు వున్న ప్రదేశాల్లో గుడ్లు పెట్టడం ద్వారా దోమల పెరుగుదలకు అవకాశాలు కలిపిస్తున్నాం అన్నారు. రోగులు బారిన పడకుండా ఇంటి పరిసరాలలో నీటి గుంటలు లేకుండా చూసుకోవాలని, ఇంటి లో నీటి నిల్వలపై తప్పనిసరిగా మూతలతో గానీ క్లాత్తో కానీ కప్పి ఉంచడం ద్వారా దోమలు నీటిలో గుడ్లు పెట్టడాన్ని నివారించవచ్చును అని తెలిపారు. ఇంటిలో మానము వాడుకునే ఫ్రిజ్ వెనుక భాగంలో నీరు చేరి ఉంటుందని, దాంట్లో కూడా దోమల గుడ్లు పెట్టి దోమల పెరుగుదలకు అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకోవాల్సిందిగా సూచించారు. దోమ కాటు నుండి రక్షణ పొందటానికి గానూ సంధ్యావేళ సమయంలో ఇంటి తలుపులు, కిటికీలను మూసి ఉంచుకోవాలని, వేప ఆకు పొగ , కాళ్లు, చేతులను పూర్తిగా కప్పి ఉంచే వస్త్రాలను ధరించడం, దోమతెరలను వాడటం, దోమ కాటు నుండి రక్షణ పొందవచ్చని తెలియజేశారు.