విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ఆత్రేయపురం:
ఆత్రేయపురం: విశ్వం వాయిస్ న్యూస్: మండలంలో వివిధ గ్రామాలలో పాతపాటి రామాంజనేయరాజు జన్మదినోత్సవం సందర్భంగా దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. హైదరాబాద్ కు చెందిన ‘ప్రణీత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ బోర్డు ఆఫ్ డైరెక్టర్ గా వాణిజ్య రంగంలో దూసుకుపోతున్న పాతపాటి రామాంజనేయరాజు ఆత్రేయపురానికి చెందిన పాతపాటి సోదరులలో ఒకరు. ఈ సోదరతృయం తమ స్వగ్రామానికి చాలాకాలంగా అనేక ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహిస్తుండటం తెలిసిందే. దశాబ్దాలుగా స్వేచ్ఛ మంచినీటి సౌకర్య కల్పన, శ్రీ వెంకట సత్య రాజ్యలక్ష్మి ట్రస్ట్ పేరిట శ్రీ లక్ష్మి వేంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం, ఏటా ఘనంగా బ్రహ్మోత్సవాల నిర్మాణం, సంక్రాంతి పండుగ సంబరాలకు ఆతిథ్యం.. వివిధ పేద రోగులకు వైద్య సహాయానికి ఆర్థిక సహకారాలు.. క్షత్రియ సమాజానికి సహాయ సహకారాలు, నిరుపేదలకు మరుగుదొడ్ల కల్పనకు సహకారం, ఇలా పలు రకాల బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు. నేడు ఈ సోదరులలో ద్వితీయ సోదరుడైన రామాంజనేయ రాజు జన్మదినోత్సవం సందర్భంగా ర్యాలి గ్రామంలో 150 మందికి స్థానిక మ్యాజిక్ హౌస్ వద్ద అనుస్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో చీరలలను పంపిణీ చేశారు. అలాగే భోజనాలు, ఎనర్జీ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, పాదరక్షలు, స్వీట్స్ తదితర నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. జెడ్.పి.టి.సి. సభ్యుడు బొనం సాయి బాబు, రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్ డైరెక్టర్ కప్పల శ్రీధర్ తదితరుల చేతుల మీదుగా ఈవస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా పాతపాటి సోదరుల సేవలను వారు కొనియాడారు. ముందు ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలతోపాటు స్వీకర్తలు పలువురు పాతపాటి రామాంజనేయరాజు కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంకా ఈ కార్య క్రమంలో మురళికృష్ణంరాజు, ముదునూరి శ్రీనివాసరాజు, అనుస్ సంస్థ అద్యక్షుడు డాక్టర్ మోహిత్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.