* గంజాయి హెరాయిన్ వినియోగంతో నేరాలు
* కార్యకర్తలు రూ.100 కోట్ల బీమా చెల్లించాం
* ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, శంఖవరం:
శంఖవరం, మే 6 (విశ్వం వాయిస్ న్యూస్) ;
ఆంధ్రప్రేశ్ పునర్నిర్మాణ త్యాగానికి నేను సిద్దం… ఈ త్యాగానికి మీరూ సిద్దంకండి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి, తెలుగు దేశం జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపు నిచ్చారు. రాష్ట్రాన్ని చెత్త చెత్త చేసేసారు. ఇపుడు రాష్ట్ర పునర్నిర్మాణం అంత సుజావుగా సాగదు… అందుకు త్యాగాలు చేయాలి…. త్యాగం చేయడానికి నేను సిద్దంగా ఉన్నాను… మరి మీరు సిద్దమా తమ్ముళ్ళూ అంటూ సభికులను ఆయన ప్రశించి ఉత్సాహ పరిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర సరకులు, పన్నులకు వ్యతిరేఖంగా రాష్ట్ర తెలుగు దేశం పార్టీ ఇచ్చిన బాదుడే … బాదుడు రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం శివారు ఓ ప్రైవేట్ రిసార్ట్సులో శుక్రవారం ఉదయం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలోనూ, అలాగే కత్తిపూడి గ్రామంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని కాకినాడ రోడ్డులో మధ్యాహ్నం నిర్వహించిన బహిరంగ సభలోనూ పూర్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ఉత్తేజ భరితంగా మాట్లాడారు. రాష్ట్రాన్ని మనం పునర్మించాలంటే రాష్ట్ర ప్రజలు అందరూ క్విట్ జగన్ అనాలి… అధికారం మన పార్టీ చేతికి రావాలి… 40 ఏళ్ళ నా రాజకీయ జీవితంలో ఏడేళ్ళు ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవలు అందించిన తనకు
ప్రస్తుతమైతే రాజ్యాధికారంపై మమకారం లేదని, ఏ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని కాపాడ డానికి స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి సంక్షేమం, అభివృద్ధికి సమ పాళ్ళలో ప్రాధాన్యమిచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసారు. మా కుటుంబ సభ్యులు కూడా త్యాగం చేసి అభివృద్ధి చేసాము. కానీ మిమ్మల్ని కలవలేక పోయాను… పొరపాటు చేసాను… ఎంతో కష్టపడి చసిన కష్టం నేడు మొత్తం బూడిదలో పోసిన పన్నీరు అయ్యిపోయిందన్న బాద, ఆవేదన నాలో ఉన్నాయి. అయినా ఫరవాలేదు. రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దామని జన హర్షామోదాల మధ్య చంద్రబాబు పునరుద్ఘాటించారు. నేను మీ అందరికీ చెపుతున్నాను. మీ కార్యకర్తలంతా ఇంటింటికీ వెళ్ళాలి. తలుపు తట్టాలి. ప్రజలను చైతన్య వంతం చెయ్యాలి. ప్రజలను ప్రజా ఉద్యమానికి సిద్దం చేయాలి. ఇదే సమయంలో నాయకులను కోరుతున్నా. మీరంతా ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల కష్టాల్లో మీరు వారికి తోడుగా అండగా ముందుండాలి. అటు కార్యకర్తల భాధ్యతలను కూడా నాయకులు తీసుకోవాలి. రాష్ట్రాన్ని పునర్నిర్మించు కుందాం. అందరం కలసి రాష్ట్రానికి పూర్వ వైభవం తేవడాని ముందుకు పోదాం. ఇదంతా చాలా కష్టమైన పని. ఇదంతా సుజావుగా జరుగదు. ఎందుకంటే వ్యవస్థలను నాశనం చేసారు. 2024 నాటికి ప్రజల నెత్తిన రూ. 11,00,000 కోట్ల అప్పు మోపారు. ఎవడు కడతాడూ… ప్రెస్స్ వాళ్ళూ మీరు కడతారా…? అని ప్రశ్నించారు. మేం చెల్లించం అని మీడియా అనేసరికి మీరు (ప్రజలు) కట్టకపోయినా ముక్కు పిండి మరీ పన్నుల రూపంలో వసూలు చేస్తారు. ఈ రాష్ట్రం నుంచి వేరే ప్రాంతానికి పోయే వారు తప్ప ఈ రాష్ట్రంలో ఉండే అందరిపైనా ఈ పన్నుల భారం పడుతుంది. అందుకే కొందరు ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితికి వస్తున్నారని చంద్రబాబు అన్నారు. 2024 నాటికి ఈ (వైఎస్సార్) ప్రభుత్వం పోకపోతే ఈ రాష్ట్రం నుంచి మేం శాశ్వతంగా వెళ్ళిపోతామని, ఇక రామనే పరిస్థితికి వారొచ్చారని ఆయన అన్నారు. ఇది శుభమా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోరా అని మిమ్మల్ని నేను అడుగుతున్నాను అని చంద్రబాబు ప్రశ్నించారు. కార్యకర్తలంతా పార్టీ సభ్యత్వాలను చేర్పించాలి. రాష్ట్రంలో గ్రామ గ్రామాన ప్రతీ కుటుంబంలోని ప్రతీ ఒక్కర్నీ పార్టీ కుటుంబ సభ్యుల్ని చేయాలి. అందుకే దేశంలో ఎక్కడా లేని రీతిలో తెలుగు దేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికీ రూ. 2,00,000 జీవితా బీమా చేయించాం… రూ. 100 కోట్ల ప్రీమియం సభ్యుల తరఫున పార్టీ చెల్లించాం. సంక్షేమంలో మనమే ముందున్నాం. అందుకే మిగతా పార్టీలు మనల్ని చూసి నేర్చుకునే పరిస్థితికి వచ్చాయని చంద్రబాబు అన్నారు. అందుకే మనం పార్టీ కుటుంబ సభ్యుల సంక్షేమాన్ని 1.0 % చేసాం… దీన్ని రాబోయే 12.0 % చేస్తాం. కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించి రాబోయే కాలంలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను కార్యకర్తలకు అమలు చేస్తాం. దీనికి మీది ఒకే ఒక సహకారం కావాలి. పార్టీ సభ్యులను చేర్పించాలి. నాకు రెండే రెండు బాధ్యతలు. ఒకటి కార్యకర్తల సంక్షేమం … రెండోది ప్రజల సంక్షేమం. అందుకే రాబోయే రోజుల్లో సంక్షేమం… అభివృద్ధి… రెండూ రెండు కళ్ళుగా నా భాద్యతలను నిర్వర్తిస్తానని మనవి చేస్తున్నానని చంద్రబాబు చెప్పుకున్నారు. వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించు కోవాల్సిన అవసరం ఏర్పడిందని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. ఇందుకోసం మరో ప్రజా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందన్న బాబు.. ప్రజలు చేపట్టే ఈ ప్రజాఉద్యమానికి తెదేపా నాయకత్వం వహిస్తుందన్నారు. వైకాపా అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని రక్షించుకు నేందుకు మరో ప్రజా ఉద్యమం అవసరం ఉందని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యమం కోసం అందరూ కలవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు చేపట్టే ఈ ప్రజా ఉద్యమానికి తెదేపా నాయకత్వం వహిస్తుంది అన్నారు. రాష్ట్రం కోసం ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని.. అవసరమైతే జైలుకైనా వెళ్తామని చంద్రబాబు వెల్లడించారు. క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అనేది ప్రజల నినాదం కావాలని ఆయన పిలుపు నిచ్చారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికే సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. తమపై కేసులు పెడితే భయపడమని.. ప్రజా సమస్యలపై పోరాడుతామని చెప్పారు. రాష్ట్ర పరిస్థితి చూసి బాధ, ఆవేదన కలుగు తున్నాయంని అన్నారు. ‘క్విట్ జగన్.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ అని ఆయన పిలుపు నిచ్చారు. ‘‘నిన్న ముగ్గురు ఆడబిడ్డలపై అత్యాచారం జరిగింది. తల్లుల పెంపకం కూడా సరిగా ఉండాలంటూ హోంశాఖ మంత్రి తల్లుల పెంపకంపై మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. సజ్జల రాసిన స్టేట్మెంట్లను ఆమె చదువుతున్నారు. రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవడానికి అందరూ ఉద్యమించాలి. రాష్ట్ర భవిష్యత్‌ను జగన్ అంధకారం చేస్తున్నారు. కరెంట్ బిల్లులను 40 శాతం పెంచారు. కరెంట్ రాదు కానీ.. బిల్లులు మాత్రం బాదుడే బాదుడు. జంగారెడ్డిగూడెం సారా మరణాలను సహజ మరణాలంటూ కొట్టిపారేశారని విమర్శించారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. పదో తరగతి పరీక్ష పత్రాలు లీకవ్వకుండా పరీక్షలను నిర్వహించలేని సీఎం.. 3 రాజధానులు కడతాడట. రాష్ట్రం నుంచి విదేశాలకు గంజాయి, డ్రగ్స్ పంపే పరిస్థితిని తీసుకొచ్చారు. మరో ప్రజాఉద్యమం అవసరం.. దీనికి అందరూ కలిసి రావాలి. ఆ ఉద్యమానికి తెదేపా నాయకత్వం వహిస్తుంది. నేను అధికారం కోసం పాకులాడే వ్యక్తిని కాదు. సీఎం పదవి నాకు కొత్త కాదు. రాష్ట్రంలో ఉన్న అందరూ పన్నులు కడుతున్నారు. వైకాపా శ్రేణులకు కూడా పన్నులు, ఛార్జీల బాదుడు ఉంది. రాష్ట్ర పునర్ నిర్మాణానికి వైకాపా శ్రేణులు కూడా కలిసి రావాలి. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు నాయకులు ప్రజలకు అండగా ఉండాలని.. వాళ్లే ముందుండి నడిపించాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా…అని చంద్రబాబు ప్రశ్నించగా … సభికులు రాలేదన్నారు… దీంతో బాబు మాట్లాడుతూ…. వచ్చాయి తమ్ముడూ… మటన్ కొట్లలో, బ్రాందీ షాపుల్లో, పులివెందులలో ఫిష్ మార్టుల్లోనూ ఉద్యోగాలు, ఊరూరికీ ఓ సైకో ఉద్యోగం వచ్చింది… ఇదీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు. లక్షల మందికి ఐటీ ఉద్యోగాలు ఇచ్చి కోట్ల రూపాయల జీతాలను సంపాదించుకొనేలా అవకాశం మనం కల్పిస్తే… కిరాణా దుకాణం సరుకుల వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చిన జగన్ నెలకో రూ. 5,000 ముష్ఠి పడేస్తున్నాడు చంద్రబాబు విమర్శించారు. ఈ కార్యక్రమంలో వరుపులరాజా, కొమ్ముల కన్నబాబు, పర్వత సురేష్, పైలాసుబాష్ చంద్రబోస్, బద్దిరామారావు,వెన్నా శివ, అమరాదివెంకట్రావు,
సూతి బూరయ్య, పైలాసాంబశివ రావు, యిట్టంశెట్టి బాస్కరబాబు, జల్లిగంపల ప్రభాకర్, సర్నంగొవిందు, సమర్లమదు, కీర్తిసుబాష్ తదితరులు పాల్గొన్నారు.