విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రావులపాలెం:
రావులపాలెం(విశ్వం వాయిస్) అసానీ తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని, 2-3 రోజుల పాటు వరి కోతలు వాయిగా వేసుకోవాలని మండల వ్యవసాయాధికారి బి.మీనా సూచించారు. సోమవారం ఆమె గ్రామాల్లో పర్యటించి రైతులకు తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మాట్లాడుతూ రావులపాలెం మండలంలో ఆదివారం సాయంత్రం 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. దీని దృష్ట్యా రైతులు ధాన్యం బస్తాలను సురక్షిత ప్రాంతాలకు తరించాలని, కళ్ళాల్లో ఉన్న ధాన్యం రాశులని బరకాలతో సంరక్షించుకోవాలని సూచించారు. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారడంతో అప్రమత్తంగా వ్యవహరించి ఆరబోసి ఉన్న రాశులను రైతులు జాగ్రత్త చేసుకోవడం వల్ల పూర్తిగా వర్షం బారిన పడకుండా నష్టం తగ్గిందన్నారు. ఇదే విధంగా రాబోయే 2-3 రోజుల పాటు వీలైతే కోతలు వాయిదా వేసుకోవాలన్నారు. ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా ధాన్యం తడిసిన యెడల 5 శాతం ఉప్పు ద్రావణం పిచికారీ చేయడం ద్వారా మొలకెత్తకుండా రక్షించుకోవచ్చని రైతులకు అవగాహన కల్పించారు….