WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

స్పందనకు వెళ్లాలంటే…. రవాణా నిల్… సమస్యలు ఫుల్

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– కలెక్టర్ స్పందిస్తే సమస్యలకు పరిష్కమార్గం దొరకవచ్చు.
– మా సమస్యలు అధికారులకు ఎలా విన్నవించాలని
ప్రశ్నిస్తున్న ప్రజలు…?
– కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి
ఇబ్బందులు.
– బస్ సౌకర్యాలు కల్పిస్తేజిల్లా కేంద్రానికి చేరుకోవచ్చు.
– జిల్లా కేంద్రమే కాకుండా కొన్ని చోట్ల స్పందన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
– గ్రీవెన్స్ కి వెళ్ళాలంటేనే సమస్య…
"" ఇక ఉన్న సమస్యలు పరిస్కారం ఎట్లా..?

– స్పందనకు రావాలంటే ఆ పాట్లు తప్పవా.!

– జిల్లా కేంద్రానికి వెళ్లాంటే సరియైన రావణ సౌకర్యం లేదు
– రామచంద్రపురం లో నెలకు వక్క వారం స్పందన కార్యక్రమం ఉండాలి

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాయవరం:

 

రాయవరం, (విశ్వం వాయిస్ న్యూస్) : 14;- ప్రభుత్వ పాలన సమన్వయంగా జరగాలని, ప్రజలకు అన్ని పథకాలు సకల సౌకర్యాలు అందించాలని రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి తలంచి రాష్ట్రంలో ఉన్న జిల్లాలని ఇంకా ఎక్కువ మొత్తంలో పెంచారు. అందులో భాగంగా మొన్నటి వరకు ఒకే జిల్లాలో పిలవ బడే మండలాలు, గ్రామాలు ఇప్పుడువేరు వేరు జిల్లాల పేర్లతో పిలవ బడుతున్నాయి. ఈ సంగతి ఇలా ఉన్నప్పటికీ జిల్లాకు దగ్గరగా ఉన్న గ్రామాలకు ఇప్పుడు ఏర్పాటైన జిల్లా దూరం అయ్యాయి. అంతే కాకుండా కనీసం జిల్లా కేంద్రానికి వెళ్లి రావాలన్న, తమ సొంత పనులు నిమిత్తం వెల్లాలన్న అసలు రవాణా సౌకర్యం లేని పరిస్థితి ఏర్పడ్డది. జిల్లా కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఎటువంటి చర్యలు తీసుకుంటే ప్రజలకు సానుకూలంగా ఉంటదో ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ఆలోచన చేయవలసి ఉన్నది. అదే విధంగా జిల్లా కేంద్రానికి వెళ్ల లేక పోతున్న ప్రజల వద్దకు అధికారులు వెళ్లి ప్రశ్నిస్తే కొన్ని సూచనలు, సలహాలు దొరుకుతాయి. అంతే కాకుండా మీడియా కథనాల సూచనలు తీసుకుంటే ప్రజల సమస్యలు పరిష్కరానికి మార్గం దొరికే అవకాశం ఉన్నది.

*పేదల కష్టాలు లికితంగా అందించలేని దుస్థితి*

పేదలు తమ కష్టాలను లిఖితపూర్వకంగా గ్రీవెన్స్ వెళ్లాలంటే నరకయాతన అనుభవించాల్సిందే…
ప్రభుత్వం జిల్లాలను పునర్విభజన చేసింది ప్రజలందరికీ పరిపాలన సౌలభ్యం కల్పించాలని ప్రతిష్టాత్మకంగా జిల్లాలు తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలు ఏర్పాటు చేసింది..అయితే కోనసీమ జిల్లా అమలాపురం ఇటు రామచంద్రపురం డివిజన్ నుండి సంక్షేమ పథకాల కొరకు అర్జీదారుడు తమ అర్జీలు సమర్పించాలని కనీసం రామచంద్రపురం నుండి అమలాపురం కోనసీమ జిల్లాకు వెళ్ళుటకు ఇటువంటి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ రామచంద్రపురం నుండి కోనసీమ జిల్లా వెళ్లాలంటే కనీసం రెండు నుండి మూడు బస్సులు మారే అవకాశం కూడా ఉంది. అయితే కోటిపల్లి రేవు నుండి కోనసీమ జిల్లాకు ఇటు రామచంద్రపురం డివిజన్ నుండి వెళ్లాలి అంటే కోటిపల్లి రేవు మీదగా పంటిమీద ప్రయాణం చేస్తే గాని సకాలంలో అమలాపురం వెళ్ళలేని పరిస్థితి. అలాగే ఇక వర్షాకాలం కి వస్తే ఆ పంటి ప్రయాణం కూడా ఉండదు… ఇక రామచంద్రపురం నుండి యానం మీదుగా అమలాపురం వెళ్లాలంటే సుమారు రెండు మూడు బస్సులు మారాల్సిందే. అయితే ఇటు రామచంద్రపురం నుండి వయా రావులపాలెం మీదుగా కోనసీమ జిల్లా అమలాపురం వెళ్లాలంటే రెండు మూడు బస్సులు కూడా మారాల్సిందే.

*సమస్యల అర్జీలు ఇవ్వాలంటే గోధారమ్మ అడ్డు*

రవాణా సౌకర్యం లేని తరుణంలో గోదావరి పంటి దాటి ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో స్పందన గ్రీవెన్స్ అందించాలంటే పడరాని పాట్లు పడుతున్నారు. కోనసీమ జిల్లాలో రామచంద్రపురం డివిజన్లలో ప్రజలకు సౌకర్యార్థం నెలకు ఒక వారం రామచంద్రపురం డివిజన్లో కలెక్టర్, ఎస్పి , ఆయా తదితర ప్రభుత్వ శాఖలు స్పందన కార్యక్రమం పెడితే బాగుంటుందని తద్వారా ప్రజలకు మంచి చేసిన వారు అవుతారని కోరుతున్నారు. అధికారులు ఇప్పటికైనా ఈ కథనానికి స్పందించి ప్రజలకు సౌకర్యార్థం రామచంద్రపురం డివిజన్లో పోలీస్ శాఖ జిల్లా ఎస్పీ, కోనసీమ జిల్లా మెజిస్ట్రేట్ జిల్లా కలెక్టర్ స్పందన కార్యక్రమం నెలలో ఒక వారం రామచంద్రపురం డివిజన్లో స్పందన కార్యక్రమం నిర్వహించాలని ప్రజలు విజ్ఞప్తికి స్పందించి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

*అధికారులు ఆలోచిస్తే… సమస్యలు కొలిక్కి*

జిల్లా కలెక్టర్, జిల్లా డివిజన్ అధికారులు కూడా ఆలోచిస్తే.. ప్రజల సమస్యలే కాదు. ప్రభుత్వ కార్యాలయానికి విధులు నిర్వహించడానికి అధికారులకు కూడా సమస్యలు తప్పే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో ఉన్న మండలాలు ఏ పరిధిలో ఉన్నాయి. అప్పుడు ఈ రవాణా వ్యవస్థ ఏవిదంగా ప్రజలకు అందుబాటులో ఉంది. ఇప్పుడు అవే మండలాలకు ఇప్పటి జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి ఎక్కడ సమస్య ఉన్నది అనేది గమనించి తగు చర్యలు తీసుకోవాలని , సమస్యలకు పరిస్కారం మార్గాలు చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement