WATCH LIVE TV

EPAPER

DOWNLOAD MOBILE APP

LOGIN

Trending

Elections

Weather

Cricket

StockMarket

JOIN US ON WHATSAPP
GET BREAKING NEWS ALERST

రైతుకు నష్టం కలగకూడదనే ఉద్దేశంతోనే రైతు భరోసా

WWW.VISWAMVOICE.COM

VISWAMVOICE NEWS TELUGU

– పేదవారికి భరోసా కల్పించే నిజమైన నాయకుడు
జగన్ మోహన్ రెడ్డి
మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రపురం:

రామచంద్రపురం, విశ్వం వాయిస్ః

పేదవారికి భరోసా కల్పించే నిజమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర మంత్రివర్యులు బీసీ సంక్షేమం, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖా మంత్రి అభివర్ణించారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ 2022-2023 మొదటి విడత ఆర్థిక సహాయ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక విజయ ఫంక్షన్ హల్లో వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ, ఎంపీ చింతా అనురాధ, కలెక్టర్ హిమాన్షు శుక్లా, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కష్టపడి పంట పండించే రైతుకు నష్టం కలగకూడదనే ఉద్దేశ్యం తోనే ముఖ్యమంత్రి వైఎస్సార్ రైతు భరోసా పధకాన్ని ప్రవేశపెట్టారన్నారు. పంట నాట్లకు సిద్ధమతున్న సమయానికే రైతులు అప్పుల భారం పడకూడదనే ఉద్దేశ్యంతో నాట్లకు ముందుగానే రైతు ఖాతాకు 2022-23 సంవత్సరానికి మొదటి విడత రైతు భరోసా కింద రూ.7500/- లు పీఎం వికాస్ తోపాటు వేయడం జరిగిందన్నారు. సమాజంలోని అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలనే ఉద్దేశ్యంతోనే రైతు భరోసా, అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, ఆసరా వంటి పధకాలను అమలు పరచడం ద్వారా సామాన్యుల జీవితాల్లో వెలుగులు నింపుచున్నాయని ముఖ్యమంత్రి సేవలను కొనియాడారు. ముఖ్యమంత్రి అంటే సామాన్య ప్రజానీకానికి భరోసాగా నిలిచారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో 2014-19 వరకు 5 సంవత్సరాల సమయంలో అప్పటి ప్రభుత్వం రైతాంగానికి కేవలం 76 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించడం జరిగిందన్నారు. 2019 నుండి 3 సంవత్సరాల వరకు ఇదే నియోజకవర్గంలో 254.66 కోట్ల రూపాయలు అందించిన ఘనత ఉందన్నారు. రైతు భరోసా ద్వారా రాబోయే 5 సంవత్సరాల నాటికి రామచంద్రపురం నియోజకవర్గ రైతాంగానికి మొత్తం 400 కోట్ల రూపాయలు లబ్ది చేకూరనున్నదని మంత్రి వెల్లడించారు.
జూన్ 1 నాటికే సాగునీరు అందించాలనే ముఖ్యమంత్రి తపనతో కోనసీమ ప్రాంత రైతాంగం 3 పంటలు పండించుకునే సౌభాగ్యం కలుగుతుందన్నారు.
స్థానిక వ్యవసాయ అధికారుల పనితీరు వలన జిల్లా రైతాంగానికి మొత్తం ఇన్పుట్ సబ్సిడీ 95 కోట్ల రూపాయలు మంజూరైతే వాటిలో 25 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గం రైతాంగానికి రావడం గొప్ప విషయమన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతాంగానికి అన్ని రకాల సేవలు వచ్చాయన్నారు.
జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ తాను రైతు కుటుంబం నుండి వచ్చానని ఏపీలో అమలు జరుగుతున్న రైతు భరోసా పథకం మంచి పధకం అన్నారు. ఎక్కడైతే రైతుకు నష్టం జరుగుతుందో ఆ నష్టాన్ని గుర్తించి సమయానికి వైఎస్సార్ రైతు భరోసా పథకం ద్వారా ఆయా రైతాంగానికి లబ్దిని అందించడం విప్లవాత్మకమైన చర్యగా కలెక్టర్ అభివర్ణించారు. జిల్లాలో ఈ పథకం ద్వారా 1,49,529 రైతులకు 82.24 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటివిడతగా చెల్లించడం జరిగిందని రెండవ విడత అక్టోబరులోను మూడవ విడత లబ్దిని జనవరి మాసంలోను అందించడం జరుగుతుందన్నారు. ఆర్భికేల ద్వారా వన్ స్టాఫ్ సెంటర్ ద్వారా ఇన్పుట్ సబ్సిడీ, విత్తనాలు, పురుగు మందులు వినియోగం వంటి అంశాలతోపాటు ఇతర వ్యవసాయ సంబందించిన అంశాలను రైతులు తెలుసుకునే సౌలభ్యం ఉందన్నారు. రైతులు నాట్లు వేసుకునే దగ్గర నుండి చేతికొచ్చిన పంటను ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించే విధానంలో ప్రభుత్వం అన్ని విధాల సిద్ధంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లను రైతులు స్నేహితులుగా భావించి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. రానున్న రోజుల్లో కోనసీమ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పరిచేవిధంగా కృషి చేస్తానని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.
అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ నుండి వృద్ధాప్యం లో ఉన్న వృద్ధుల సంక్షేమానికి ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నారని అందులో భాగంగా రైతాంగం సంక్షేమం కోసం వైఎస్సార్ రైతు భరోసా పధకం ద్వారా రైతులకు భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి, ఇతర అధికారులు జిల్లాకు సంబందించిన లబ్దితోపాటు రామచంద్రపురం నియోజకవర్గానికి చెందిన లబ్దిని లబ్దిదారులకు అందించారు. తొలుతగా జ్యోతి ప్రజ్వలన చేసి మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అంతకు ముందు సమావేశ ప్రాంగణంలో వ్యవసాయ శాఖచే ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎంపీ అనురాధ, కలెక్టర్ హిమాన్షు శుక్లా, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తిలకించారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు ఎస్. రామారావు, నీటి సంఘాల నాయకులు త్రినాధ్ రెడ్డి, అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ మెంబర్ బి.సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి వై.ఆనందకుమారి, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

advertisement

సంబందిత వార్తలు

ట్రెండింగ్

తాజా వార్తలు

advertisementWanted

క్రికెట్

advertisement