విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రామచంద్రపురం:
రామచంద్రపురం అర్బన్ (విశ్వం వాయిస్ )
పరిధిలోని జామియా మసీదు, మదీనా మసీదుల నూతన పాలకవర్గ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్స్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి జనాబ్ ఎల్. అబ్దుల్ ఖాదిర్ శుక్రవారం (రిజిష్టర్ నెం:250/2022) ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు నూతన మేనేజింగ్ కమిటి అధ్యక్ష ,కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. నూతన అధ్యక్షునిగా జనాబ్ అబ్దుల్ కరీం, ఉపాధ్యక్షునిగా షేక్ దావూద్ (రబ్బాని) ,కార్యదర్శిగా సయ్యద్ మొహిద్దీన్ బాషా, కోశాధికారిగా మహమ్మద్అలీ, సభ్యులుగా షేక్ సుభాని, షేక్ రహీమ్, షేక్ మహ్మద్ అల్లావుద్దీన్, షేక్ కరిముల్లా సన్నాఫ్ మదీనా సాహెబ్, షేక్ కరిముల్లా సన్నాఫ్ ఇమామ్ సాహెబ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
తుర్పు గోదావరి జిల్లా వక్ఫ్స్ బోర్డు ఆడిట్ ఇనస్పెక్టర్ జనాబ్ గౌస్ బాషాతో కలసి నూతన కార్యవర్గం గౌరవ బి సి సంక్షేమ,సినిమాటోగ్రఫీ, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణను కలవడం జరిగింది. అనంతరం మంత్రి వేణు గోపాల కృష్ణకు మసీదుల పాలక వర్గ సభ్యులను పరిచయం చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ సయ్యద్ కె యం కె కె మస్తాన్,పట్టణ వై యస్ ఆర్ సి పి కన్వీనర్ గాధంశెట్టి శ్రీధర్,13 వ వార్డు కౌన్సిలర్ కేతా శ్రీను ,ఎండీ అన్వర్ బాషా,ఎండీ బషీరుద్దిన్,యస్ వలీ, ఫాయాజ్,సయ్యిద్ అక్బర్,కరిముల్లా తదితరులు పాల్గొన్నారు.