పోలీస్ స్టేషన్ ను వేదికగా చేసుకుని నాటకాలు ఆడుతున్న ఎమ్మెల్యే ను అరెస్ట్ చేయాలి -మాజీ ఎమ్మెల్యే అయితాభక్తుల ఆనందరావు డిమాండ్
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, Ravulapalem:
ఎన్నడూ ఎక్కడా లేని విధంగా రాజ్యాంగానికి , చట్టానికి విరుద్ధంగా పోలీస్ స్టేషన్లో స్థానిక ప్రజాప్రతినిధి స్టేషన్ వద్ద బైటాయించి స్టేషన్ లోనే పరుపులు వేసుకుని నిద్రించారని , మందితో స్టేషన్ ను ఘరావ్ చేసారని అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని , కేసు నమోదు చేసి జిల్లా పోలీస్ సూపర్ డెంట్ , జిల్లా కలెక్టర్ చిత్తశుద్ధి చాటుకోవాలని అమలాపురం మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు . రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేకుండా పోయిం దని దళితులపై దాడులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆవే దన చెందారు . దళితులపై జరుగుతున్న అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు హెచ్చరించారు . ఈ సమావేశంలో మాజీ శాసనసభ్యులు బండారు సత్యానందరావు , మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రమణ్యం , అమలాపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ , మేక ఆనందరావు , వెలగల శ్రీనివాస్ , రెడ్డి సతీష్ రాజు , గుత్తుల రాంబాబు , విజయసాగర్ , చిన్నారావు , తెలుగుదేశం పార్టీ నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.