విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, కాకినాడ:
కాకినాడ ప్రెస్‌క్లబ్ నూతన అద్యక్షుడిగా అచ్యుత రామారావు
– ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయం
కాకినాడ, 26 అక్టోబరు : కాకినాడ ప్రెస్‌క్లబ్ నూతన అద్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ పీతల అచ్యుత రామారావును నియమిస్తూ ప్రెస్‌క్లబ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రధాన కార్యదర్శి గునిపే శోభన్‌బాబు అధ్యక్షతన కాకినాడ ప్రెస్‌క్లబ్ కార్యాలయంలో జరిగిన ఈ సమీవేశంలో ఎగ్జిక్యూటివ్ కమిటీ తీర్మాణించింది. ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా కొనసాగిన మంగా వెంకట శివరామకృష్ణ వ్యక్తిగత పోకడలను ఎగ్జిక్యూటివ్ కమిటీ తప్పుపట్టింది. సమావేశాలకు గైర్హాజరుకావటం, సమన్వయ లోపం, స్వప్రయోజనాలు, ప్రెస్‌క్లబ్ అభివృద్దిపై నిర్లక్ష్యం తదితర కారణాలను ఎగ్జిక్యూటివ్ కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపద్యంలో గత అధ్యక్షుడిని తొలగించి, నూతన అధ్యక్షుడిగా అచ్యుత రామారావును నియమిస్తూ ప్రదాన కార్యదర్శి శోభన్‌బాబు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపద్యంలో కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్ష మార్పు అనంతరం కార్యాలయంలో నూతన అధ్యక్షుడిని పూలమాలతో, దుశ్సాలువాతో ఘనంగా సత్కరించారు.
“వార్త” జాతీయ దినపత్రిక బ్యూరోగా పనిచేసిన ప్రస్తుత అధ్యక్షుడు అచ్యుత రామారావు ప్రస్తుతం ఎస్‌ఎల్‌టి ఛానల్‌లో బ్యూరోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాల్లో పాల్లొన్న ఆయన ప్రెస్‌క్లబ్ అభివృద్దికి విశేషకృషి చేసిన విషయం అందరికీ తెలిసిందే. గురువారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశానికి 24 సభ్యులకు గాను 23 మంది హాజరయ్యారు. సమావేశంలో భాగంగా క్లబ్ సభ్యుల 2022 సభ్యత్వ కొనసాగింపు, నూతన సభ్యుత్వాలు జారీ, ప్రెస్‌క్లబ్ అభివృద్ది, సంక్షేమం తదితర అంశాలపై చర్చించింది.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు అచ్యుత రామారావు మాట్లాడుతూ ప్రెస్‌క్లబ్ సభ్యుల సంక్షేమం, అభివృద్దికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా కీలక భూమిక పోషిస్తున్న పాత్రికేయ వృత్తికి గౌరవం చేకూర్చేందుకు పాటుపడతానన్నారు. ప్రెస్‌క్లబ్ సభ్యుల పిల్లల విద్యాభ్యాసం, ఇళ్ల స్ధలాల మంజూరు, ఆరోగ్య, భీమా పథకాలకోసం శక్తివంచనలేకుండా కృషి చేసి, ఆర్ధికంగా సతమతమవుతున్న జర్నలిస్ట్ కుటుంభాలకు ప్రెస్‌క్లబ్ సభ్యుల సహకారంతో అండగా ఉండేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాకినాడ రామారావుపేట మూడు లైట్ల జంక్షన్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో 100 మంది సమావేశం అయ్యేందుకు వీలుగా కార్యాలయాన్ని రూపొందించడం జరిగిందన్నారు. కాకినాడలోని ప్రజాసంఘాలు, ఉద్యోగ సంఘాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన సూచించారు. ఫోన్ నెంబరు – 63002 02248, 98488 51052 లను సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.