విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, రాజమహేంద్రవరం సిటీ:
ఎం.ఎస్.ఆర్.ఫాలోవర్స్ సభ్యుడు ఉప్పాడ శంకర్ రెడ్డి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఎం.ఎస్.ఆర్ ఫాలోవర్స్ సభ్యుల అధ్వర్యంలో మంగళవారం గోదావరి పుష్కర ఘాట్ వద్ద పేదలకు భోజనాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా హాజరైన రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి చేతులు మీదుగా ఈ భోజనం ప్యాకెట్లు అందించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శంకర్ రెడ్డి చాలా మంచి మనిషని,ఆయన ఏం.ఎస్.ఆర్ ఫాలోవర్స్ లో కాని,తమ కుటుంబంలో కాని ఒక సభ్యుడిగా ఉండేవారని,ఆయన మృతి బాధాకరమన్నారు.గత సంవత్సరం శంకర్ రెడ్డి కాలం చేసిన సమయంలో తాను నగరంలో లేనని,ఆ వార్త తెలిసి మనసు తరుక్కు పోయిందని విచారం వ్యక్తంచేశారు.ఆయన కుటుంబానికి కొండంత ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రార్ధిస్తున్నా,ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు.కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గుద్దే రఘు,డేవిడ్,ఎస్ కె షరీఫ్,కోటేశ్వరరావు,ఆనంద్,శేఖర్,కుమార్ పాల్గొన్నారు.