విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, ముమ్మిడివరం:
*జోడో యాత్ర తో*
*కాంగ్రెస్ కు పూర్వ వైభవం*
ఎఐసిసి కార్యదర్శి గిడుగు…
ముమ్మిడివరం విశ్వం వాయిస్ న్యూస్ రిపోర్టర్
అఖిల భారత కాంగ్రెస్ పార్టీనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశ ప్రజల నుంచి అనూహ్య మద్దతు వస్తోందని ఎఐసిసి కార్యదర్శి గిడుగు రుద్రరాజు చెప్పారు. నగర పంచాయతీ పరిధిలోని స్థానిక ఎయిమ్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో గురువారం డా.బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా గౌతమ్ అధ్యక్షతన జరిగినది.ఈ సమావేశానికి ఎఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ
భారత్ జోడో యాత్ర దేశ ప్రజలను మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ఐక్యం చేయాలనే లక్ష్యం తో జరుగుతున్నదని. ఈ యాత్రకు దేశ ప్రజల నుంచి వస్తున్న మద్దతుతో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం రానున్నదని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జంగా గౌతమ్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజేపి పాలన మెజారిటీ ప్రజలకి వ్యతిరేకంగా పనిచేస్తుంటే రాష్ట్రంలోనీ జగన్ ప్రభుత్వము అన్ని విషయాల్లో మోదీ విధానాలను అవలంబిస్తుందని,దేశానికి మేలు జరగాలంటే కేంద్రములోను రాష్ట్రంలోను కాంగ్రెస్ అధికారం లోకి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అలాగే జాతీయ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షునిగా మల్లిఖార్జున్ ఖర్గే ఎన్నిక కావడం పట్ల సమావేశం హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకి అభినందనలు తెలిపింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా దేశానికి కాంగ్రెస్ పార్టీ యే ప్రత్యామ్నాయం అని మరోసారి రుజువైందని కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. జనవరి తరువాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జోడో యాత్రకు ప్రణాళికను సిద్ధం చేసి రాబోవు ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్ధం చేయాలని, ప్రజా సమస్యల పై సమిష్టి పోరాటాల ద్వారా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.అలాగే ప్రధాని మోడీ విశాఖ పర్యటన నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా చేయకపోవడాన్ని, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటికరణను నిరసిస్తూ నిరసన కార్యక్రమాలను చేపట్టాలని శ్రేణులను ఆదేశించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చీకట్ల అబ్బాయి (ఉప్పల గుప్తం) కామన ప్రభాకర్ రావు (మండపేట) పెన్మత్స జగ్గప రాజు ములపర్తి మోహన్ రావు మాచవరపు శివన్నారాయణ వంటేద్దు బాబీ అయితాబత్తుల సుభాషిణి దొనిపాటి విజయలక్ష్మి షకీలా దామిశెట్టి జయ రాజేంద్రబాబు గెడ్డం సురేష్ బాబు యార్లగడ్డ రవీంద్ర రెడ్డిబాబు వడ్డి నాగేశ్వరరావు ముషిని శివ ప్రసాద్ అప్పన రామకృష్ణ గుబ్బల రవి మండల అధ్యక్షుడు నెల్లి వెంకటరమణ గెడ్డం వెంకటేశ్వరరావు ముషినీ సుబ్బారావు పోలిశెట్టి హరిబాబు గోడి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.