– ఇళ్ళ నిర్మాణం అనుమతులు క్లిష్టతరం
-ప్రజల సమస్యలు బుట్టదాఖలు
– మెరుగైన పాలన అందించాలని విజ్ఞప్తి
విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా,విశ్వం వాయిస్ ప్రత్యేక ప్రతినిధి సి.హెచ్.ప్రతాప్: రాష్టంలోనే అత్యధిక ఆదాయం కలిగిన పంచాయతీగా రావులపాలెం గ్రామ పంచాయతీ వినుతి కెక్కింది. వ్యాపార రంగంలోను చక్కని అభివృద్ధి గంచి అత్యధిక లావాదేవీలు జరిగే గ్రామంగా పేరు గాంచింది రావులపాలెం. ఇంటి పన్నులు, షాపింగ్ కాంప్లెక్స్ లు ,మార్కెట్లు,సినిమాహాల్స్,హోటల్స్ నుండి వచ్చే పన్నులు ఈ పంచాయితీకి ఆదాయం కోట్లల్లో వుండి, మిగితా మున్సిపాలిటీలకు దీటుగా రావులపాలెం గ్రామం నెలకొంది.అలాగే ఈ గ్రామం నేషనల్ హైవే ని ఆనుకొని ఉండటంతో వ్యాపారం, వాణిజ్య పరంగా అభివృద్ధి చక్కని చెందివుంది.అటువంటి పంచాయతీలో పలు సమస్యలు తిష్ట వేసుకుని వున్నాయి. ఉదాహరణకు పంచాయితీ పరిధిలో ఒక మధ్యతరగతి మానవుడు ఒక ఇల్లు నిర్మించు కోవాలంటే పంచాయతీ అధికారులు చుట్టూ అప్రూవల్ కోసం నెలలు తరబడి తిరగాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. సామాన్య ప్రజలు పంచాయతీకి వెళ్లి దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ముందుగా రాజకీయ నాయకులు, దళారుల ప్రమేయం అధికంగా వుంటోంది.వీరి చేతులు తడిపితే గాని ఏ పని అయ్యే పరిస్థితి ఇక్కడ లేదు . ఈ పరిస్థితిని కాదని ఒకవేళ ప్రజలు నేరుగా పంచాయితీ కార్యాలయానికి వెళ్ళి ధరకాస్తులు పెట్టుకుంటే వాటికి అతీ గతీ ఉండదు. ధరకాస్తుల యొక్క స్టేటస్ కూడా చెప్పడానికి ఇక్కడి పంచాయితీ ఉద్యోగులు ముందుకు రావడం లేదు. అందువలన ఇక తప్పనిసరై దళారులను ప్రజలు ఆశ్రయించాల్సి వస్తోంది.
నిత్యం వందల సంఖ్యలో ఇక్కడికి ప్రజలు వివిధ సమస్యలపై ధరకాస్తులు తీసుకొని వస్తుండగా , వాటిని స్వీకరించి సకాలంలో పరిష్కరించే విధంగా చర్యలు పంచాయితీ అధికారులు తీసుకోకపోవడం పై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల వద్దకు సుపరిపాలన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు పని చేస్తుంటే రావులపాలెం గ్రామ పంచాయితీ లో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా వున్నాయి. ఇక్కడి పంచాయితీ కార్యాలయంలో తమ సమస్యలు పరిష్కారం కావడం లేకపోవడం తొ ప్రజలు ఇక తప్పని సరి పరిస్థితులలో మండల కార్యాలయాలను, జిల్లా పరిషత్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయవలసి వస్తోంది.
మరొక సమస్య పంచాయతీ ప్రభుత్వ స్థలాల్లో,ఇరిగేషన్ స్థలాల్లో కొందరు ఆక్రమించి అన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా ఆకాశ హర్మ్యాలు అడ్డగోలుగా నిర్మిస్తున్నా రెవెన్యూ,పంచాయతీ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకుండా నిర్లిప్తంగా వ్యవహరిస్తుండదం బాధాకరమైన విషయం. సామాన్యులు ఒక అడుగు స్థలం పొరపాటున ఆక్రమిస్తే రాత్రికి రాత్రి వచ్చి వీటిని కూలగొట్టే అధికారులు, అడ్డగోలుగా అక్రమ నిర్మాణాల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా స్థాయి అధికారులు వెంటనే స్పందించి రావులపాలెం గ్రామాన్ని సందర్శించి ,వాస్తవ పరిస్థితులను పరిశీలించి అక్రమ నిర్మాణ కట్టడాలు పై చర్యలు తీసుకోవడమే కాకుండా, గ్రామ పంచాయితీ లో మెరుగైన పాలన చేపట్టే విధంగా పంచాయతీ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.