కోరుకొండ మే 17 (విశ్వం వాయిస్ న్యూస్)
తెలుగుదేశం పార్టీ రాజానగరం నియో
జకవర్గ ఇంచార్జ్ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు రాజమహేంద్రవరం రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం బూరుగుపూడి గేటు వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోరుకొండ,రాజానగరం, సీతానగరం మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుని బొడ్డు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోరుకొండ స్వయంభు శ్రీలక్ష్మి నరసింహస్వామికి బొడ్డు పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బూరుపూడి తెదేపా కార్యాలయం లో కేక్ కట్ చేసి, బొడ్డుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ నారా లోకేష్ కు బొడ్డు అనుంగ నాయకుడిగా ఉంటూ పార్టీలో అంచెలంచలాగా ఎదుగుతున్నారని, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తూ అన్ని వర్గాల ప్రజల ఆదరణతో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లకు తెదేపా మండల కన్వీనర్ దూది కాంతారావు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయగా,భోజనాలు బాగున్నాయంటూ దూదికి కితాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కన్వీనర్లు గంగిశెట్టి చంటిబాబు, కంటే నాగ కేశవరావు, దూది కాంతారావు, నూనె వెంకన్న, తనకాల నాగేశ్వరరావు,పుప్పాల వెంకటరత్నం, మార్ని రాము, మార్ని బుజ్జి, తెలగంశెట్టి శ్రీనివాస్, రొంగల శ్రీను, కొయ్యే సామ్యూల్,ముండ్రు గాంధీ,బుద్ధ బాపూజీ, కోర్పు రామకృష్ణ, పెనకటి గంగాధర్, తనకాల రామలింగేశ్వర రావు, పీతా శ్రీనుబాబు, కోర్పు రాజేష్, మాత ప్రభు, పలువురు తెదేపా నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

