విశ్వంవాయిస్ న్యూస్, అమలాపురం ( అమలాపురం ):
నాపై వచ్చిన వదంతులు అవాస్తవం.
పాస్టర్ హోసన్నా
అంబాజీపేట ( విశ్వం వాయిస్ న్యూస్)
అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామంలో
చర్చి నిర్వహిస్తున్న బెజవాడ హోసన్న అను నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పెళ్లి కాని అమ్మాయిని గర్భవతి చేసి 10 లక్షలకు మగ బిడ్డను అమ్ముకున్నానని, మగ బిడ్డకు జన్మనిచ్చిన అమ్మాయికి డబ్బు ఆశ చూపి 10 లక్షల రూపాయలకు మగ బిడ్డను అమ్మేశానని వచ్చిన వదంతులు అవాస్తవమని మీడియా ముందు పాస్టర్ హోసన్నా బుదవారం
తెలిపారు. నాపై అసత్య ఆరోపణలు చేసిన కొంత మంది వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. పెళ్లి కాకుండానే గర్భవతి అయిన శిరీష తన తండ్రి తో కలిసి నా దగ్గరకు వస్తే సహాయం చేసే సదుద్దేశంతో సలహా మాత్రమే ఇచ్చానని, అంతకుమించి నాకేమీ తెలియదని, నాపై కావాలని కొంతమంది మత ఛాందసవాదులు, అమ్మాయి కుటుంబానికి సంబంధం లేని వ్యక్తులు నాపై దుష్ప్రచారం చేసి నా పరువు తీసారని వాపోయారు.
కొల్లి శిరీషా మీడియా ముందు మాట్లాడుతూ నాకు గర్భం రావడానికి పాస్టర్ హోసన్న కి ఎటువంటి సంబంధం లేదని, మా గ్రామంలో కుసుమ మోహన్ కృష్ణ నన్ను ప్రేమించి అతని ద్వారా గర్భం ధరించి, పూర్తిగా మోసపోయానని తెలిపింది. ఈ ఘటనపై పూర్తి విరుద్ధంగా అసత్య ఆరోపణలు చేసిన కోట రమేష్ (ప్రభుదిన్), నామాడి అబ్బులు, భాను ప్రకాష్, నక్క విజయ్, అమూల్య కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ లో ఇచ్చిన ఫిర్యాదు లో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. నా ఆరోగ్య పరిస్థితిలో మార్పులు రావటంతో పాస్టర్ హోసన్నా సలహా మేరకు డాక్టర్ని సంప్రదించగా గర్భవతి అని చెప్పారని తండ్రి లాంటి పాస్టర్ హోసన్న దగ్గరికి వెళ్ళగా ఆయన సలహా మాత్రమే ఇచ్చారని అంతకుమించి ఆయనకు ఏమీ తెలియదని అన్నారు. ఈసంఘటనపై పూర్తిగా మోసపోయి మానసికంగా కృంగి ఉండగా నాపై అసత్య ఆరోపణలు చేసిన వ్యక్తులు నన్ను బ్లాక్ మెయిల్ చేసి కొంత డబ్బును ఇవ్వాలని కోరడంతో నేను నిరాకరించారని అందుకే విష ప్రచారం చేసి మా కుటుంబాన్ని బయటకు లాగారని, ఈ ఘటనపై అమలాపురం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ హిమాన్ష్ శుక్లా కి పిర్యాదు చేయటం జరిగిందని, వారిపై తగు చర్యలు తీసుకోని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.