కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కోరింగ పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు
విశ్వంవాయిస్ న్యూస్, తాళ్ళరేవు:
కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన ఎస్పీ సతీష్ కుమార్ కాకినాడ రూరల్ లోని కోరింగ పోలీస్ స్టేషన్లో ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పరిశీలించి అమలులో ఉన్న ఉమెన్ హెల్ప్ డెస్క్, ఇతర విభాగాల పనితీరును సిబ్బంది నుండి అడిగి సమాచారం తెలుసుకున్నారు. గ్రామాల నుండి సమాచార వ్యవస్థ పటిష్టంగా ఉండేలా మహిళా పోలీస్ యొక్క సేవలు వినియోగించుకోవాలని సూచించారు. వచ్చిన ప్రతి కేసు త్వరగతిన పరిష్కరించి ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. ఆయన వెంట ఎస్పీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.