ePaper
Tuesday, October 6, 2026
ePaper
Homeఎడిటోరియల్రామచంద్రపురం ఆర్టీసీ డిపోలో రూ.30 లక్షల భారీ కుంభకోణం

రామచంద్రపురం ఆర్టీసీ డిపోలో రూ.30 లక్షల భారీ కుంభకోణం

📰 Generate e-Paper Clip

రామచంద్రపురం : విశ్వం వాయిస్ న్యూస్

రామచంద్రపురం ఆర్టీసీ డిపోలో భారీ కుంభకోణం వెలుగుచూసింది. డిపోలో సుమారు రూ.30,05,373 మేర నగదు గల్లంతైనట్లు అధికారులు నిర్ధారించారు. ఈ వ్యవహారానికి సంబంధించి డిపో క్లర్క్ ఏ.పీ.కె. రావు (E.306977) పై డిపో మేనేజర్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కుంభకోణం విషయం బయటపడటంతో సదరు క్లర్క్ ఆగస్టు 18వ తేదీ నుంచి విధులకు గైర్హాజరవుతున్నారు. ప్రస్తుతం విజిలెన్స్ మరియు అకౌంట్స్ అధికారులు డిపోలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఈ తనిఖీల్లో క్యాష్ గల్లంతు మాత్రమే కాకుండా, మ్యారేజ్ స్పెషల్ బస్సుల వసూళ్లతో పాటు డబుల్ డ్యూటీల్లోనూ పలు అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. డిపో మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img