GOKAVARAM, East Godavari (VISWAM VOICE DESK):
గోకవరం దేవి చౌక్ సమీపంలోని అరవపేటలో పారిశుద్ధ్య లోపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీలు నిండిపోయి మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తుండటంతో దోమల బెడద పెరిగిందని స్థానికులు వాపోతున్నారు. గత వారం రోజులుగా పలువురు జ్వరాలతో బాధపడుతున్నారని, చిన్నారులు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీలు, చెత్తను తొలగించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

