ePaper
Wednesday, October 7, 2026
ePaper
Homeతూర్పుగోదావరిప్రజా సమస్యపై ‘విశ్వంవాయిస్‌’ పోరాటం.. కదిలిన విద్యుత్‌ శాఖ

ప్రజా సమస్యపై ‘విశ్వంవాయిస్‌’ పోరాటం.. కదిలిన విద్యుత్‌ శాఖ

📰 Generate e-Paper Clip

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:, East Godavari (VISWAM VOICE DESK):

విశ్వంవాయిస్‌ ఎఫెక్ట్‌.. విద్యుత్‌ సమస్యలపై స్పందన

 రాయవరానికి ప్రత్యేక ఫీడర్‌ ఏర్పాటుకు చర్యలు.. 

 వెదురుపాక, వెదురు పాక సావరానికి ప్రత్యేక ఫీడర్‌ పనులు ప్రారంభం

 

మండల కేంద్రమైన రాయవరంలో విద్యుత్‌ సరఫరా సమస్యలు, లోవోల్టేజీ, తరచూ విద్యుత్‌ అంతరాయాలు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్‌ తీగలు, స్తంభాల సమస్యలపై విశ్వంవాయిస్‌ తెలుగు దినపత్రిక వెలువరించిన వరుస కథనాలకు విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించారు. ‘అంధకారంలో దళితవాడ సహా పలు ప్రాంతాలు’, ‘విద్యుత్‌ వ్యవస్థపై ‘లోడ్‌’ ఎక్కువ.. పరిష్కారానికి వేగం తక్కువ!’ తదితర కథనాల ద్వారా రాయవరం ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యలను విశ్వంవాయిస్‌ వెలుగులోకి తీసుకువచ్చింది. ఇటీవల ఇందిరా కాలనీ సమీపంలో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగి, తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్న ఘటనపై కథనం ప్రచురించడంతో విద్యుత్‌ శాఖ ఏఈ సందాక శ్రీనివాసులు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని మరమ్మతు పనులను పర్యవేక్షించి, ప్రమాదకరంగా ఉన్న తీగలను సరిచేసి సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. అదే సమయంలో రాయవరం మండల కేంద్రానికి ప్రత్యేక విద్యుత్‌ ఫీడర్‌ ఏర్పాటు చేయాలన్న ప్రజల డిమాండ్‌పై ఉన్నతాధికారులతో చర్చించినట్లు ఏఈ తెలిపుతూ ప్రత్యేక ఫీడర్‌ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం వెదురుపాక, వెదురుపాక సావరం ఇదే ఫీడర్‌పై ఆధారపడటం వల్ల అక్కడ ఏర్పడే అంతరాయాల ప్రభావం రాయవరంపైనా పడుతోందని, ప్రత్యేక ఫీడర్‌ ఏర్పాటు అయితే మండల కేంద్రానికి విద్యుత్‌ సరఫరా మరింత మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇదే క్రమంలో వెదురుపాక, వెదురుపాక సావరం గ్రామాలకు వేరుగా ప్రత్యేక ఫీడర్‌ ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించినట్లు ఏఈ సందాక శ్రీనివాసులు వెల్లడించారు. లోవోల్టేజీ, వోల్టేజ్‌ హెచ్చుతగ్గులు, తరచూ లైన్‌ బ్రేక్‌డౌన్లు, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ వైర్లు, పాత స్తంభాలు తదితర సమస్యలను విశ్వంవాయిస్‌ వరుస కథనాల ద్వారా ప్రజల తరఫున అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. సమస్య వచ్చిన ప్రతిసారీ తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం చూపాలని కథనాల ద్వారా కోరింది. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన విశ్వంవాయిస్‌ కథనాలకు స్పందనగా అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టడంతో పాటు ప్రత్యేక ఫీడర్ల ఏర్పాటుకు ముందడుగు వేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యను గుర్తించడం మాత్రమే కాకుండా.. పరిష్కారం లభించే వరకు అంశాన్ని అనుసరించడమే విశ్వంవాయిస్‌ లక్ష్యమని, ఈ స్పందన ప్రజా జర్నలిజానికి నిదర్శనమని పలువురు పేర్కొంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img