ePaper
Thursday, September 17, 2026
ePaper
Homeస్పోర్ట్స్రావులపాలెం జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో హసనబాద జడ్పీ పాఠశాల విద్యార్థుల సత్తా

రావులపాలెం జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో హసనబాద జడ్పీ పాఠశాల విద్యార్థుల సత్తా

📰 Generate e-Paper Clip

RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):

కోనసీమ జిల్లా రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం నిర్వహించిన జూనియర్ అథ్లెటిక్స్ పోటీల్లో హసనబాద జడ్పీ పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని పాఠశాల హెచ్ఎం ఎస్.బి.ఎస్.కె సుందరి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ పోటీల్లో 8వ తరగతి విద్యార్థి తవుటిక మణికంఠ జిల్లా స్థాయి ట్రై అథ్లెన్‌లో తృతీయ స్థానం సాధించగా, 10వ తరగతి విద్యార్థి కాళా హర్షవర్ధన్ జిల్లా స్థాయి పెంట అథ్లెన్‌లో అలాగే హై జంప్‌లో ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ ప్రతిభ ఆధారంగా ఈ ఇద్దరు విద్యార్థులు వచ్చే నెల 2, 3 తేదీల్లో కర్నూలు జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు కోనసీమ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. విద్యార్థులను అభినందించడంతో పాటు వారికి తర్ఫీదునిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయులు జి. రాజుబాబు, దుర్గాప్రసాద్‌లను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img