Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):
మండపేట అర్నాబ్ తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మండపేట 33వ వార్డు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి షేక్ గౌస్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. జోరు వానను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలకు అవసరమైన సహాయ చర్యలపై దృష్టి సారించారు.తుఫాను ప్రభావంతో పలు వార్డుల్లో రోడ్లపై, విద్యుత్ లైన్లపై చెట్లు పడిపోవడంతో వాటిని వెంటనే తొలగించి ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. తుఫాను కారణంగా ప్రజలకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు.అదేవిధంగా 33వ వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. తుఫాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివసిస్తున్న వారు ప్రమాదాలను నివారించేందుకు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు.తుఫాను తీరం దాటినప్పటికీ భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. వార్డులో ఎవరికైనా సహాయం అవసరమైతే తనను సంప్రదించాలని, ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన సహాయక చర్యల్లో భాగస్వామి అవుతానని షేక్ గౌస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రబ్బానీ, షేక్ & షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ అలీఖాన్ బాబా, షేక్ సర్కార్, షేక్ జిలాని,సయ్యద్ మైనర్ బాబు,ఈలి తాతాజీ, నీలం సత్తిబాబు,తదితరులు పాల్గున్నారు.

