ePaper
Wednesday, October 28, 2026
ePaper
Homeరాజకీయంతుఫాన్‌ సహాయక చర్యల్లో వేగుళ్ల అజయ్‌ బాబు..

తుఫాన్‌ సహాయక చర్యల్లో వేగుళ్ల అజయ్‌ బాబు..

📰 Generate e-Paper Clip

Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):

నష్టాలను పరిశీలించి బాధితులకు భరోసా….

 

మండపేట అర్నాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో మండపేట పట్టణం అతలాకుతలమైంది. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా పలు వార్డుల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వృక్షాలు విరిగి ఇళ్లపై, విద్యుత్‌ వైర్లపై పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.ఈ నేపథ్యంలో కూటమి మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి వేగుళ్ల అజయ్‌ బాబు పట్టణంలోని తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, జరిగిన నష్టాలను పరిశీలించారు. ఇళ్లపై చెట్లు విరిగిపడిన ప్రాంతాలను, నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలను, తెగిపడిన విద్యుత్‌ వైర్లను పరిశీలిస్తూ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.తుఫాన్‌ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న అజయ్‌ బాబు, బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్‌ వైర్లు తెగిపడిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img