ePaper
Wednesday, October 28, 2026
ePaper
Homeఎడిటోరియల్అధికారుల అప్రమత్తతతో తప్పిన పెను ముప్పు

అధికారుల అప్రమత్తతతో తప్పిన పెను ముప్పు

📰 Generate e-Paper Clip

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:, East Godavari (VISWAM VOICE DESK):

తుఫాను తీవ్రతకు ఇల్లు ధ్వంసం..

ముందస్తు హెచ్చరికతో తప్పిన ప్రాణాపాయం 

 

తుఫాను తీవ్రతకు మంగళవారం రాత్రి మండల కేంద్రమైన రాయవరంలోని ఆండ్ర పెద్ద అబ్బాయిగారి వీధిలో సరెళ్ల దిమ్మ సమీపంలో ఓ పాత ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. మరకా అనంతలక్ష్మికి చెందిన ఈ ఇల్లు తుఫాను ప్రభావంతో పైకప్పు కూలిపోయి, గోడలు సైతం దెబ్బతిన్నాయి. తుఫాను తీవ్రత దృష్ట్యా అధికారులు ముందుగానే ప్రజలను అప్రమత్తం చేసి, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారుల హెచ్చరికలను పాటించి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు ముందుగానే ఇంటిని ఖాళీ చేసి బయటకు రావడంతో పెను ప్రాణాపాయం తప్పింది. ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోవడంతో ఇంట్లోని సామగ్రి దెబ్బతిన్నట్లు బాధితులు తెలిపారు. ప్రస్తుతం తాము నీడ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం తమ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తక్షణ సహాయం అందించాలని అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. తుఫాను వంటి విపత్కర పరిస్థితుల్లో అధికారులు ముందస్తుగా హెచ్చరికలు జారీ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం స్థానికంగా ఊరటనిచ్చింది. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం, పునరావాస సదుపాయం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img