ePaper
Monday, October 26, 2026
ePaper
Homeఎడిటోరియల్తుపాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

తుపాను నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:, East Godavari (VISWAM VOICE DESK):

వరి పంటకు నష్టం వాటిల్లకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలి

మండల వ్యవసాయ అధికారి కెవిన్ రమేష్ కుమార్ సూచనలు

 

ఆర్నాబ్ తుపాను ప్రభావంతో అతివేగంగా గాలులు వీచడంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వరి రైతులు అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి కెవిన్ రమేష్ కుమార్ సూచించారు. వరి పొలాల్లో నీరు నిలిచిపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం పొలాల్లో అదనపు నీరు ఉన్నట్లయితే వెంటనే బయటకు పంపించాలని, పొలం బోదెలు, గట్లు, నీటి పారుదల మార్గాలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావం తగ్గిన అనంతరం వీలైనంత వరకు వరి పంట కోత చేపట్టాలని తెలిపారు. ఇప్పటికే కోత కోసిన పంటను తడవకుండా సురక్షిత ప్రాంతాల్లో నిల్వ చేసుకోవాలని సూచించారు. పంటను భద్రపరిచేందుకు అవసరమైన రైతులు స్థానిక సొసైటీ కార్యదర్శులను సంప్రదించి టార్పాలిన్లు వినియోగించుకోవచ్చని తెలిపారు. తుపాను పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా ఉండి వ్యవసాయ శాఖ అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలని మండల వ్యవసాయ అధికారి కెవిన్ రమేష్ కుమార్ కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img