రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:, East Godavari (VISWAM VOICE DESK):
తుఫాన్ ప్రభావం దృష్ట్యా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. రాయవరం మండల కేంద్రంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసి, విద్యుత్ తీగలకు సమీపంలో ఉన్న బలహీనమైన చెట్లు, కొమ్మలను సిబ్బంది తొలగించారు. తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులు పెరిగే అవకాశం ఉండటంతో ప్రమాదాలను నివారించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ తీగలు, చెట్ల సమీపంలోకి వెళ్లవద్దని సూచించారు.

