ePaper
Friday, October 23, 2026
ePaper
Homeతూర్పుగోదావరిఎంపీటీసీ బరిలో అభ్యర్థుల జోరు

ఎంపీటీసీ బరిలో అభ్యర్థుల జోరు

📰 Generate e-Paper Clip

రాయవరం, విశ్వంవాయిస్ న్యూస్:, East Godavari (VISWAM VOICE DESK):

గ్రామాల వారీగా పోటీలోకి దిగిన అభ్యర్థులు..

 

వైఎస్సార్సీపీ 18, టీడీపీ 12, జనసేన 8

 

రాయవరం మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు కూడా ఉత్సాహంగా కొనసాగింది. గురువారం దాఖలైన నామినేషన్ల వివరాలను అధికారులు వెల్లడించారు. రెండో రోజు మొత్తం 38 మంది అభ్యర్థులు వివిధ ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయగా, వీరిలో వైఎస్సార్సీపీ నుంచి 18 మంది, టీడీపీ నుంచి 12 మంది, జనసేన నుంచి 8 మంది ఉన్నారు. వెంటూరు-1 నుంచి టీడీపీ తరఫున టేకుమూడి శ్రీనివాస వరప్రసాద్, వైఎస్సార్సీపీ తరఫున వెంకటలక్ష్మి చాపల, విజయకుమారి దార్ల, వెంటూరు-2 నుంచి జనసేన తరఫున కొప్పిరెడ్డి తాతాజీ, అమజాల శ్రీనివాస్, వైఎస్సార్సీపీ తరఫున వరప్రసాద్ బోనం నామినేషన్లు దాఖలు చేశారు. వి.సావరం నుంచి టీడీపీ తరఫున పంపన సీతామహాలక్ష్మి, జ్యోతి నూకుర్తి, వి.సావరం-1 నుంచి వైఎస్సార్సీపీ తరఫున కనకదుర్గ గుత్తుల నామినేషన్లు వేశారు. సోమేశ్వరం-1 నుంచి టీడీపీ తరఫున శాక సత్యనారాయణమ్మ, సోమేశ్వరం-2 నుంచి జనసేన తరఫున శాక వెంకట రత్నవతి, గరగ రాఘవమ్మ నామినేషన్లు సమర్పించారు. కుర్మాపురం నుంచి జనసేన అభ్యర్థులుగా పైడికొండల భాగ్యశ్రీ, పైడికొండల వీరలక్ష్మి పోటీలోకి దిగారు. చెల్లూరు-1 నుంచి జనసేన తరఫున కొండేపూడి శివ, మిరియాల రాము, చెల్లూరు-2 నుంచి వైఎస్సార్సీపీ తరఫున నాగేశ్వరరావు కాదా, చెల్లూరు-3 నుంచి వైఎస్సార్సీపీ తరఫున గనగ భవాని యనమదల, విజయలక్ష్మి యనమదల నామినేషన్లు దాఖలు చేశారు. పాసలపూడి-1 నుంచి టీడీపీ తరఫున అనసూరి గోవిందరాజు, వైఎస్సార్సీపీ తరఫున హనుమాన్ ప్రసాద్ కొల్లి, సత్యనారాయణ బొడబొల్ల, పసలపూడి-2 నుంచి టీడీపీ తరఫున నల్లమిల్లి సత్యనారాయణరెడ్డి, బండారు వెంకట రామకృష్ణ, నల్లమిల్లి అమ్మిరెడ్డి, వైఎస్సార్సీపీ తరఫున రామమోహన్‌రెడ్డి చింతా, సుధాకర్‌రెడ్డి కొవ్వూరి నామినేషన్లు సమర్పించారు. మాచవరం-1 నుంచి టీడీపీ తరఫున బేత సునీత, బేత అమ్మాజీ, వైఎస్సార్సీపీ తరఫున జ్యోతి వెంకట దుర్గాభవాని అముజూరి, మాచవరం-2 నుంచి వైఎస్సార్సీపీ తరఫున చంద్రశేఖర్‌రెడ్డి మేడపాటి నామినేషన్లు వేశారు. వెదురుపాక-1 నుంచి టీడీపీ తరఫున టేకుమూడి శ్రీనివాస వరప్రసాద్, వైఎస్సార్సీపీ తరఫున శ్రీను కంచి, వెదురుపాక-2 నుంచి జనసేన తరఫున కొప్పిరెడ్డి తాతాజీ, అమజాల శ్రీనివాస్, వైఎస్సార్సీపీ తరఫున వరప్రసాద్ బోనం నామినేషన్లు దాఖలు చేశారు. నదురుబాద నుంచి వైఎస్సార్సీపీ తరఫున మిడ్తిపాటి విజయ్ కుమార్, మిడ్తిపాటి సత్యనారాయణ నామినేషన్లు సమర్పించారు. దీంతో రెండో రోజు నామినేషన్లతో రాయవరం మండలంలో ఎన్నికల పై ఆశక్తి మరింత పెరిగింది. నామినేషన్ల చివరి రోజున మరింత మంది అభ్యర్థులు పోటీలోకి వచ్చే అవకాశం ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img