Mandapeta, East Godavari (VISWAM VOICE DESK):
మండపేట పురపాలక సంఘ ఎన్నికల్లో భాగంగా 33వ వార్డు కూటమి జనసేన అభ్యర్థి పొలమూరి విజయ దుర్గాప్రసాద్ గురువారం గొల్లపుంతలోని 24 వ వార్డు టిడ్కో అపార్ట్‌మెంట్ల, 25 వ వార్డు గొల్ల పుంత కాలనీ వద్ద విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 33 వ వార్డు లో ఓట్లు ఉన్న వారు ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఈ నేపద్యంలో ఇక్కడి వచ్చి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మైనార్టీ సెల్ నాయకులు ఎండీ కరీం ఖాదిరి, మాజీ కౌన్సిలర్లు బెల్లపు కొండ దొరబాబు, లంకలపల్లి రాంబాబు, రాంబిల్లి పాపారావు తదితరులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు.ఈ సందర్భంగా టీడీపీ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ కరీం మాట్లాడుతూ టిడ్కో అపార్ట్‌మెంట్లలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటిని దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.గొల్లపుంత టిడ్కో అపార్ట్‌మెంట్లలో నివసిస్తూ గాంధీనగర్ 33వ వార్డులో ఓటు హక్కు కలిగిన ఓటర్లను ప్రత్యేకంగా కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. 33వ వార్డు జనసేన అభ్యర్థి పొలమూరి విజయ దుర్గాప్రసాద్‌కు గాజు గ్లాసు గుర్తుపై, మండపేట మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి వేగుళ్ల అజయ్ కుమార్‌కు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఎన్నికల రోజున గాంధీనగర్‌లోని తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కూటమి అభ్యర్థుల విజయంతోనే వార్డులో అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యమవుతాయని నాయకులు పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

