RAMACHANDRAPURAM, Dr. B.R. Ambedkar Konaseema (VISWAM VOICE DESK):
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం లో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్ . శ్రీనివాస్ ఆధ్వర్యంలో అర్థశాస్త్ర, వాణిజ్య శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో అతిథి ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగింది. సి. ఎస్.టి.ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జంగారెడ్డిగూడెం ఎకనామిక్స్ అధ్యాపకులు బి.శ్రీనివాసరావు విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ పై మరియు ఆర్థిక శాస్త్రం యొక్క పాత్రను వివరించారు. విద్యార్థులతో ముఖాముఖీ చర్చలో ప్రతిభ కనబర్చిన ముగ్గురు విద్యార్థులకు బి.శ్రీనివాసరావు రూ. 1500 చొప్పున ప్రోత్సాహక నగదు బహుమతులు అందించారు.
అదేవిధంగా ఎకనామిక్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రోత్సాహక బహుమతి ఇవ్వడానికి గాను పదివేల రూపాయలు కళాశాలకు అందిస్తానన్న విషయాన్ని తెలియజేశారు. విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీనివాసరావు తెలియజేసిన ఈ నిర్ణయానికి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. చిట్టిబాబు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం చరిత్ర మరియు వాణిజ్య శాస్త్ర అధిపతి డాక్టర్ బి. నాగరాజు ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇతర అధ్యాపకులు జి.ఎస్. దుర్గారావు, రాజేష్, చిరంజీవి మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

